హాట్‌స్టార్‌లో విడుదలైన ‘హార్ట్ బీట్’ వెబ్ సిరీస్ 100కి పైగా ఎపిసోడ్‌లతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆ సిరీస్ విపరీతంగా ఆకట్టుకుంది. త్వరలో సీజన్ 2 రావడానికి రెడీ అవుతోంది. ఆ సిరీస్ కి దర్శకత్వం వహించిన అబ్దుల్ కబీజ్ నుంచి వచ్చిన మరో సిరీస్ ‘ఆఫీస్’. ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్, ఈ నెల 9వ తేదీ నుంచి తెలుగులో అందుబాటులోకి వచ్చింది. 48 ఎపిసోడ్స్ గా వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ
టౌనుకు కాస్త దూరంగా ఉన్న ఒక ఊరు. అక్కడి తహశీల్దారు ఆఫీసులో తహశీల్దారు రాఘవన్, డిప్యూటీ తహశీల్దారుగా నెపోలియన్ పనిచేస్తూ ఉంటారు. ఇందూ, ముత్తు, షమ్మీ, సన్నీ అక్కడ పనిచేస్తూ ఉంటారు. ఇక తమ ప్రాజెక్టు పనిలో భాగంగా ఐటీ నుంచి పారి, మూర్తి, ప్రకాశ్ అక్కడికి వస్తారు. తహశీల్దారు నుంచి మొదలు, అక్కడున్న వాళ్లందరికీ ఒక్కొక్కరికి ఒక్కో బలహీనత ఉంటుంది. దాంతో పని తక్కువ మాటలు ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది.ఇక ఆ ఊరు వాళ్లు మద్యం గురించి తప్ప మరిదేని గురించిన ఆలోచన చేయరు. పైగా ప్రతి చిన్న విషయానికి తహశీల్దారు ఆఫీసుకి వచ్చి గొడవపడుతూ ఉంటారు. దాంతో సాధ్యమైనంత త్వరగా ఐటీలో(IT) జాబ్ సంపాందించి వెళ్లిపోవాలని ఇందూ ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యలోనే తరచూ ఆమె ‘పారి’తో గొడవపడుతూ ఉంటుంది. పారి కూడా ఆమెతో గొడవపడుతున్నా, ఆమె పట్ల జాలి మాత్రం పెరుగుతూ పోతుంటుంది.’పారి’కి దూరంగా ఉండటానికి ఇందూ ప్రయత్నిస్తూ ఉంటే, అతనికి దగ్గరవడానికి ‘ముత్తు’ ట్రై చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆఫీసులో నెపోలియన్(Napoleon) నిద్రపోతుండటాన్ని వీడియో తీసిన షమ్మీ దానిని తన యూట్యూబ్ ఛానల్(YouTube channel) లో పోస్ట్ చేస్తుంది. అది కాస్త పై అధికారుల దృష్టిలో పడుతుంది. అదే సమయంలో తహశీల్దారు ఆఫీసుకి వచ్చిన ఓ వృద్ధురాలు అనుకోకుండా క్రిందపడిపోతుంది. ఉలుకూ పలుకు లేకపోవడంతో అక్కడి వాళ్లంతా ఏం చేస్తారు? ఫలితంగా ఏం జరుగుతుంది? వృద్ధురాలి విషయంలో స్టాఫ్ కి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది? ఇందూ పట్ల పారి ప్రేమకథ వర్కవుట్ అయ్యేనా? అనేది కథ.

కథనం
కామెడీని లవ్ఎ మోషన్స్ ను కలుపుతూ, వర్క్ ప్లేస్ లో ఆసక్తికరమైన డ్రామాను నడిపించడంలో దర్శకుడిగా అబ్దుల్ కబీజ్ కి మంచి అనుభవం ఉంది. ఆ విషయం గతంలో వచ్చిన ‘హార్ట్ బీట్’ సిరీస్ నిరూపించింది. కార్పొరేట్ హాస్పిటల్ నేపథ్యంలో ఆ కథ నడుస్తుంది. ఇక ఈ సిరీస్(Series) విషయానికి వస్తే, తహశీల్దారు ఆఫీసు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ‘హార్ట్ బీట్‘లోని కొంతమంది ఆర్టిస్టులు కూడా ఈ సిరీస్ లో కనిపిస్తారు. విలేజ్ వాతావరణం, అక్కడివారి స్వభావాలు పెద్దగా చదువుకోని కారణంగా అక్కడివారితో తహశీల్దారు ఆఫీసు సిబ్బందికి ఎదురయ్యే తలనొప్పులు,సిబ్బంది చాదస్తాలను,బద్ధకాలను టచ్ చేస్తూ వెళ్లిన తీరు ఆకట్టుకుంటుంది. అలకలు,బుజ్జగింపులు,అసహనాలతో ఎపిసోడ్స్ నడుస్తాయి.
Read Also :Indian Army: భారత సైన్యానికి విరాళం ప్రకటించిన విజయ్‌దేవరకొండ