సుప్రీంకోర్టులో ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి ఎదురుదెబ్బ తగిలింది. నీట్ కౌన్సిలింగ్ – 2022లో అర్హురాలైన విద్యార్థినికి ఎంబీబీఎస్ సీటు నిరాకరించినందుకు రూ.7 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోడానికి సుప్రీంకోర్టు(Supreme Court నిరాకరించింది.వివరాల్లోకి వెళితే వైద్య విద్యలో ప్రవేశాల కోసం 2022లో నీట్ రాసిన నెల్లూరుకు చెందిన రేవూరు వెంకట ఆశ్రిత ఎన్‌సీసీ ఓపెన్ మహిళా కేటగిరీ కింద ఎంబీబీఎస్‌లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్నారు.ఎన్‌సీసీ(NCC)లో తనకంటే తక్కువ మెరిట్, నీట్‌లో తక్కువ మార్కులు వచ్చిన మరో విద్యార్థినికి నెల్లూరులోని నారాయణ మెడికల్ కళాశాలలో సీటు కేటాయించడంతో ఆశ్రిత హైకోర్టు(High Court)ను ఆశ్రయించారు.కేసును విచారించిన హైకోర్టు ఆశ్రిత కంటే తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థినికి సీటు కేటాయించడం చట్టవిరుద్ధమని ఫిబ్రవరి 20న తేల్చి చెప్పింది. అంతేకాకుండా వర్శిటీ అధికారుల చర్యలతో ఎంబీబీఎస్ సీటు కోల్పోయి డెంటల్ కోర్సులో చేరిన ఆశ్రితకు నష్టపరిహారంగా రూ.7 లక్షలు చెల్లించాలని వైద్య విశ్వవిద్యాలయానికి ఆదేశాలు జారీ చేసింది.

ధర్మాసనం
అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ మార్చి 6న ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం అప్పీల్‌లో జోక్యం చేసుకోవడానికి ఎటువంటి కారణాలు కనిపించడం లేదని పేర్కొంది. న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ రాజేశ్ బిందల్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.మరోవైపు హైకోర్టు తీర్పును ఉదహరణగా చూపి భవిష్యత్తులో ఇతరులెవరూ పరిహారం పొందడానికి వీల్లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.
Read Also : Chandrababu Naidu : కడప మహానాడు ప్రాధాన్యతపై చర్చ : చంద్రబాబు