వక్ఫ్ సవరణ చట్టం చెల్లుబాటుపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో, ఉన్నత న్యాయస్థానం ముస్లిమేతరులను వక్ఫ్ కౌన్సిల్‌లో నియమించొద్దని ఆదేశించింది. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ లు విచారించారు. పలు పిటిషన్లలో వక్ఫ్ చట్టంలో చేసిన సవరణలపై చట్టబద్ధతను సవాల్ చేశారు.

ప్రస్తుతం ఎలాంటి మార్పులు వద్దు – కోర్టు సూచన
వాదనలు వింటూ ధర్మాసనం స్పష్టం చేసింది: “ప్రస్తుత పరిస్థితుల్లో వక్ఫ్ చట్టంలో ఎలాంటి మార్పులు చేయరాదు.” అలాగే వక్ఫ్ ఆస్తులుగా కోర్టులు ఇప్పటికే గుర్తించిన వాటిని డి-నోటిఫై చేయొద్దని కేంద్రాన్ని ఆదేశించింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, మరికొన్ని పత్రాలు సమర్పించేందుకు ఒక వారంరోజుల గడువు కోరారు. ధర్మాసనం దీనికి అనుమతి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. “ఈ విచారణ ముగిసేవరకు సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, వక్ఫ్ బోర్డుల్లో ఎలాంటి నియామకాలు జరగవు.” తాత్కాలికంగా నియామకాలకు బ్రేక్, వక్ఫ్ చట్టంపై చర్చ కొనసాగుతుంది.
ఈ తీర్పుతో వక్ఫ్ చట్టానికి సంబంధించి చట్టబద్ధత అంశం పై భారత సుప్రీంకోర్టు ముందున్న కేసు మరింత ప్రాధాన్యం పొందింది. ముస్లిం మైనారిటీలకు చెందిన ఆస్తుల పరిరక్షణ, నిర్వహణ, నియమాలపై తీసుకునే
భవిష్యత్ లో న్యాయ, రాజకీయ పరంగా కీలక మార్గనిర్దేశం కావచ్చు.
Read Also: Signboards :ఉర్దూ భాషకు అనుమతి: సుప్రీంకోర్టు తీర్పు