हिन्दी | Epaper

UP: ‘వందేమాతరాన్ని వ్యతిరేకించడం దేశద్రోహమే’: యోగి ఆదిత్యనాథ్

Vanipushpa
UP: ‘వందేమాతరాన్ని వ్యతిరేకించడం దేశద్రోహమే’: యోగి ఆదిత్యనాథ్

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. జాతీయ చిహ్నాలను గౌరవించని వారు.. వందేమాతరం గేయాన్ని వ్యతిరేకించే వారు దేశద్రోహానికి పాల్పడుతున్నట్లేనని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. దేశ రాజ్యాంగం పట్ల గౌరవం లేనివారే ఇలాంటి వివాదాలకు తెరలేపుతున్నారని సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లను ఉద్దేశించి ఆయన మండిపడ్డారు.

Read Also: Prathyusha death case: ప్రత్యూష మృతి కేసులో సిద్ధార్థ రెడ్డికి లభించని ఊరట!

Yogi Adityanath
UP: ‘వందేమాతరాన్ని వ్యతిరేకించడం దేశద్రోహమే’: యోగి ఆదిత్యనాథ్

జాతీయ గేయాన్ని పాడబోమని అనడం ఏంటి?”

శాసన మండలిలో గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చకు సమాధానం అస్తూ.. యోగి ఆదిత్యనాథ్ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. “ఒకవైపు రాజ్యాంగం గురించి గొప్పగా మాట్లాడుతూనే.. మరోవైపు జాతీయ గేయాన్ని పాడబోమని అనడం ఏంటి?” అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగ సభ 1950 జనవరి 24నే వందేమాతరానికి జాతీయ గేయంగా గుర్తింపు ఇచ్చిందని.. దీనిని వ్యతిరేకించడం అంటే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారిని అవమానించడమేనని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలను నిర్వహిస్తున్న తరుణంలో విపక్షాల తీరు అభ్యంతరకరంగా ఉందని పేర్కొన్నారు.

యూపీలో అంతా బాగుంది: యోగి

2017కు ముందు ఉత్తరప్రదేశ్ ఎలా ఉండేదో గుర్తుచేస్తూ.. ప్రస్తుతం రాష్ట్రంలో వచ్చిన మార్పులను యోగి వివరించారు. గతంలో యూపీ అంటే అరాచక ప్రదేశ్ (ఉపద్రవ్ ప్రదేశ్) అని, ఇప్పుడు అది ఉత్సవ ప్రదేశ్‌గా మారిందని చెప్పారు. ఒకప్పుడు భయంతో బతికిన ప్రజలు.. ఇప్పుడు భక్తి మార్గంలో ఉన్నారని పేర్కొన్నారు. దానికి నిదర్శనం మహాకుంభమేళాకు 66 కోట్ల మంది, ప్రస్తుత మాఘమేళాకు 21 కోట్ల మంది భక్తులు హాజరవ్వడమేనని తెలిపారు. “నా కర్ఫ్యూ, నా దంగా.. యూపీ మే సబ్ చంగా” (అల్లర్లు లేవు, కర్ఫ్యూలు లేవు.. యూపీలో అంతా బాగుంది) అంటూ రైమింగ్‌తో ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

వినూత్నంగా కేకేఆర్ జెర్సీ

వినూత్నంగా కేకేఆర్ జెర్సీ

ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు

ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

📢 For Advertisement Booking: 98481 12870