हिन्दी | Epaper

Student suicide: ట్యూషన్‌కు వెళ్లనని మారం..మందలించిన తల్లి బాలుడి ఆత్మహత్య

Sharanya
Student suicide: ట్యూషన్‌కు వెళ్లనని మారం..మందలించిన తల్లి బాలుడి ఆత్మహత్య

ముంబై నగరంలోని కండివాలి ప్రాంతంలో ఓ పద్నాలుగు సంవత్సరాల బాలుడు (Fourteen-year-old boy) ఆత్మహత్య (Student suicide) చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. ట్యూషన్‌కు వెళ్లాలని తల్లి చేసిన ఒత్తిడి కారణంగా బాలుడు ఈ తీవ్ర చర్యకు పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన విద్యార్థులపై చదువుల ఒత్తిడి ఏ స్థాయిలో ప్రభావం చూపుతున్నదో మరోసారి చాటిచెప్పింది.

ఘటన వివరాలు:

14 ఏళ్ల పంత్ ఆర్తి మక్వానా (Pant Aarti Makwana), అనే బాలుడిని అతని తల్లి నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో ట్యూషన్‌కు వెళ్లమని చెప్పింది. అయితే, ట్యూషన్‌కు వెళ్లేందుకు పంత్ ఇష్టపడలేదు. తల్లి పదేపదే చెప్పడంతో చివరకు అయిష్టంగానే ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. కొడుకు ట్యూషన్‌కు వెళ్లాడని తల్లి భావించింది. కానీ, కొద్ది నిమిషాలకే వారి అపార్ట్‌మెంట్ వాచ్‌మన్ పరుగున వచ్చి, పంత్ భవనం పైనుంచి పడిపోయాడని (Student suicide) చెప్పాడు. ఈ వార్త విన్న తల్లి వెంటనే కిందకు వెళ్లి చూడగా, తన కుమారుడు రక్తపు మడుగులో పడి ఉండటం చూసి షాక్‌కు గురైంది.

పోలీసుల స్పందన:

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన వాంగ్మూలంలో అనుమానించదగ్గ అంశాలేవీ కనిపించలేదని, అయినప్పటికీ ఈ ఘటనపై అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. చదువుల ఒత్తిడి కారణంగానే బాలుడు ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉంటాడని ప్రాథమికంగా భావిస్తున్నారు.

Read also: Delhi: ఢిల్లీ లో జంట హత్యల కలకలం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఉరిలో చొరబాటు యత్నం భగ్నం: ఉగ్రవాది ఖతం!

ఉరిలో చొరబాటు యత్నం భగ్నం: ఉగ్రవాది ఖతం!

పీఎం కిసాన్ డబ్బులు రాలేదా.. ఇలా ఫిర్యాదు చేయండి !

పీఎం కిసాన్ డబ్బులు రాలేదా.. ఇలా ఫిర్యాదు చేయండి !

ప్రియురాలిని కేబుల్ వైర్‌తో గొంతు నులిమి హత్య చేసిన ప్రియుడు

ప్రియురాలిని కేబుల్ వైర్‌తో గొంతు నులిమి హత్య చేసిన ప్రియుడు

గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. ఆ కనెక్షన్ ఉంటే సిలిండర్ రాదు!

గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. ఆ కనెక్షన్ ఉంటే సిలిండర్ రాదు!

నేడు ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల

నేడు ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల

స్టైఫండ్ ఎగ్గొట్టిన కాలేజీలకు జరిమానా విధించిన ఎన్ఎంసీ

స్టైఫండ్ ఎగ్గొట్టిన కాలేజీలకు జరిమానా విధించిన ఎన్ఎంసీ

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

📢 For Advertisement Booking: 98481 12870