हिन्दी | Epaper

Shreyas Iyer: పంజాబ్ కింగ్స్ ఓటమిపై శ్రేయస్ అయ్యర్ ఏమన్నారంటే?

Anusha
Shreyas Iyer: పంజాబ్ కింగ్స్ ఓటమిపై శ్రేయస్ అయ్యర్ ఏమన్నారంటే?

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా మంగళవారం ఆర్‌సీబీతో జరిగిన ఫైనల్లో పంజాబ్ కింగ్స్ 6 పరుగుల తేడాతో ఓటమిపాలై తృటిలో టైటిల్ చేజార్చుకుంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) ఫైనల్లో ఓడినా తమ ఆటగాళ్లంతా మెరుగైన ప్రదర్శన చేశారని కొనియాడాడు.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ స్పిన్నర్ కృనాల్ పాండ్యా అసాధారణ బౌలింగ్ ప్రదర్శనతో తమ ఓటమిని శాసించాడని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ఈ ఓటమి తీవ్ర నిరాశకు గురిచేసిందని చెప్పాడు.’నిజాయితీగా చెప్పాలంటే ఈ ఓటమి తీవ్ర నిరాశకు గురి చేసింది. ఫైనల్లో ఓడినా మా కుర్రాళ్ళు సందర్భానికి తగినట్లుగా ఆడారు. ఈ మ్యాచ్‌లో ఓడాల్సింది కాదేమో కానీ సపోర్ట్ స్టాఫ్, టీమ్ మేనేజ్‌మెంట్‌తో పాటు మా విజయాల్లో భాగమైన ప్రతీ ఒక్కరికి క్రెడిట్ ఇవ్వాలి. గత మ్యాచ్ నేపథ్యంలో 200 పరుగుల లక్ష్యం సులువు అనుకున్నాం. కానీ ఆర్‌సీబీ(RCB) బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా కృనాల్ పాండ్యా అసాధారణ ప్రదర్శనతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అతని అనుభవాన్ని ఉపయోగించి బౌలింగ్ చేశాడు.

అభినందనలు

మా జట్టులోని ప్రతీ ఆటగాడు రాణించాడు. వారి ప్రదర్శన పట్ల నేను చాలా గర్వపడుతున్నాను. మా జట్టులో చాలా మంది కుర్రాళ్లు తొలి సీజన్ ఆడారు. అయినా వారు ఫియర్‌లెస్ గేమ్(Fearless Game) ఆడారు. వారు లేకుంటే మేం ఇక్కడి వరకు వచ్చేవాళ్లం కాదు. వారికి అభినందనలు. వచ్చే ఏడాది టైటిల్ గెలిచే ప్రయత్నం చేస్తాం. మేము ప్రతి మ్యాచ్‌కు గెలుస్తామనే నమ్మకంతో బరిలోకి దిగాం. వచ్చే ఏడాది కూడా ఇదే తరహా ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాం.’అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.

Shreyas Iyer: పంజాబ్ కింగ్స్  ఓటమిపై  శ్రేయస్ అయ్యర్ ఏమన్నారంటే?
Shreyas Iyer

హాఫ్ సెంచరీతో రాణించినా

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(35 బంతుల్లో 3 ఫోర్లతో 43) టాప్ స్కోరర్‌గా నిలవగా మయాంక్ అగర్వాల్(24), రజత్ పటీదార్(26), లివింగ్ స్టోన్(25), జితేష్ శర్మ(24) పర్వాలేదనిపించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/40), కైల్ జెమీసన్(3/48) మూడేసి వికెట్లు తీయగా అజ్మతుల్లా ఒమర్జాయ్, విజయ్ కుమార్ వైశాఖ్(Vijay Kumar Vaishakh), యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీసారు.అనంతరం 20 ఓవర్లలో పంజాబ్ 7 వికెట్లకు 184 పరుగులే చేసి ఓటమిపాలైంది. శశాంక్ సింగ్(29 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 61 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. ఆర్‌సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(2/38), కృనాల్ పాండ్యా(2/17) రెండేసి వికెట్లు తీయగా జోష్ హజెల్ వుడ్, రొమారియో షెపర్డ్ తలో వికెట్ తీసారు.

Read Also: Virat Kohli: ఆర్‌సీబీ జట్టుకు నేను విధేయుడిని:కోహ్లీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఐపీఎల్ 2026కు ముందు కేకేఆర్ కీలక నిర్ణయం తీసుకుంది.

ఐపీఎల్ 2026కు ముందు కేకేఆర్ కీలక నిర్ణయం తీసుకుంది.

సీఎస్కేపై సన్ టీవీ కాపీరైట్ దావా

సీఎస్కేపై సన్ టీవీ కాపీరైట్ దావా

PSL నుంచి గుడకేశ్ వెస్టిండీస్ స్టార్ ఔట్

PSL నుంచి గుడకేశ్ వెస్టిండీస్ స్టార్ ఔట్

ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

సిరాజ్ కి బర్త్ డే గ్రీటింగ్స్ తెలిపిన జిటి
0:52

సిరాజ్ కి బర్త్ డే గ్రీటింగ్స్ తెలిపిన జిటి

క్రికెట్ లో సంచలనం, పాక్ స్పిన్నర్‌ను కొనుగోలు చేసిన SRH

క్రికెట్ లో సంచలనం, పాక్ స్పిన్నర్‌ను కొనుగోలు చేసిన SRH

ధోనీకి ఇదే చివరి సీజన్: ఇర్ఫాన్ పఠాన్

ధోనీకి ఇదే చివరి సీజన్: ఇర్ఫాన్ పఠాన్

ఘనంగా రేపు కుల్దీప్ యాదవ్ పెళ్లి ఏర్పాట్లు

ఘనంగా రేపు కుల్దీప్ యాదవ్ పెళ్లి ఏర్పాట్లు

సోదరుడి పెళ్లి ఫోటోలను షేర్ చేసిన సారా

సోదరుడి పెళ్లి ఫోటోలను షేర్ చేసిన సారా

బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ జట్లకు ప్రాక్టీస్ విషయంలో కొత్త రూల్స్

బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ జట్లకు ప్రాక్టీస్ విషయంలో కొత్త రూల్స్

పాక్ ప్లేయర్ ఎంపిక ఎఫెక్ట్.. సన్‌రైజర్స్ ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్!

పాక్ ప్లేయర్ ఎంపిక ఎఫెక్ట్.. సన్‌రైజర్స్ ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్!

IPL 2026 ప్రారంభానికి ముందు ఆర్సీబీకి షాక్ తగిలింది.

IPL 2026 ప్రారంభానికి ముందు ఆర్సీబీకి షాక్ తగిలింది.

📢 For Advertisement Booking: 98481 12870