हिन्दी | Epaper
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

Rambhadracharya: జగద్గురు ఆశీస్సులు అందుకున్న ఆర్మీ చీఫ్

Ramya
Rambhadracharya: జగద్గురు ఆశీస్సులు అందుకున్న ఆర్మీ చీఫ్

చిత్రకూట్‌లో ఆర్మీ చీఫ్‌కు ఆధ్యాత్మిక ఆశీర్వచనం

భారత సైన్యాధిపతి (COAS) జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పవిత్రతకు ప్రతీకగా నిలిచిన చిత్రకూట్ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసిద్ధ హిందూ ఆధ్యాత్మిక గురువు, సంస్కృత పండితుడు, తత్త్వవేత్త అయిన జగద్గురు రాంభద్రాచార్య (Jagadguru Rambhadracharya) వారిని ఆశ్రమంలో కలిసి ఆశీర్వాదాలు పొందారు. దేశ సరిహద్దుల భద్రతకు పాటుపడుతున్న భారత సైన్యాధిపతిని స్వామీజీ గౌరవంగా ఆహ్వానించారు. ప్రత్యేకంగా, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) అంశంపై జగద్గురు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

Jagadguru Rambhadracharya

పీఓకేను గురుదక్షిణగా సమర్పించాలని విజ్ఞప్తి

జనరల్ ఉపేంద్ర ద్వివేది జగద్గురు ఆశ్రమానికి విచ్చేసిన సందర్భంగా, రాంభద్రాచార్య స్వామీజీ ఆయనకు ప్రత్యేకంగా లంకకు వెళ్లే ముందు హనుమంతునికి “ఏ రామ్ మంత్ర దీక్షను ఇచ్చారో “, అదే దీక్షను జనరల్ ద్వివేదికి కూడా ఇచ్చినట్లు జగద్గురు రాంభద్రాచార్య తెలిపారు. ఇదే మంత్రాన్ని సైన్యాధిపతికి ఇచ్చినట్లు స్వామీజీ ప్రకటించారు. అంతేకాక, స్వామీజీ ఎంతో ఉదాత్తమైన విజ్ఞప్తి చేశారు – పీఓకేను తిరిగి సాధించి, దానిని తనకు గురుదక్షిణగా సమర్పించాలని కోరారు. అనంతరం వారిద్దరి మధ్య ఆథ్యాత్మిక విషయాలపై చర్చ జరిగింది. ఆశ్రమంలోని ఇతర సాధువులు, విద్యార్థులతో కూడా ఆర్మీ చీఫ్ ముచ్చటించారు.

జనరల్ ద్వివేది ఆధ్యాత్మిక చర్చలో పాల్గొన్న సందర్బం

ఆశ్రమంలో ఇతర సాధువులు, విద్యార్థులతో జనరల్ ద్వివేది ముచ్చటించారు. భారత సైన్యం దేశభద్రతకు మాత్రమే కాదు, సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలకు కూడా గౌరవం ఇస్తుందని ఈ సందర్శన స్పష్టంగా చూపించింది. ఆర్మీ చీఫ్ తన ప్రసంగంలో భారతదేశ ఆధ్యాత్మిక ప్రాచీనతను కొనియాడారు. అలాగే, దేశ భద్రత, సైనికుల త్యాగాలపై తన అభిప్రాయాలను వ్యక్తీకరించారు. ఈ భేటీ ద్వారా భారత సైన్యం మరియు హిందూ ఆధ్యాత్మికత మధ్య సంబంధాన్ని బలపర్చే ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

“పీఓకేను గురుదక్షిణగా సమర్పించండి” – ఆర్మీ చీఫ్‌కు జగద్గురు విజ్ఞప్తి

ఈ భేటీ సందర్భంగా జగద్గురు రాంభద్రాచార్య, పీఓకేను తిరిగి సాధించి, దానిని తనకు గురుదక్షిణగా ఇవ్వాలని జనరల్ ద్వివేదిని కోరారు. హిందూ సంప్రదాయంలో గురువుకు శిష్యుడు సమర్పించే కానుక లేదా గౌరవాన్ని గురుదక్షిణ అంటారు. జగద్గురు రాంభద్రాచార్య ప్రఖ్యాత హిందూ ఆథ్యాత్మికవేత్త, సంస్కృత పండితుడు మరియు తత్వవేత్త. ఆయన అనేక గ్రంథాలను రచించారు. ఆయన వాక్కుకు దేశవ్యాప్తంగా విశేష ఆదరణ ఉంది. ఆర్మీ చీఫ్‌కు ఆయన చేసిన ఈ విజ్ఞప్తి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

Read Also: Shashi Tharoor: ఉగ్రవాదంపై మోదీ చర్యలను ప్రశంసించిన శశిథరూర్ మండిపడ్డ.. కాంగ్రెస్ నేతలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870