భారత రైల్వే శాఖ ప్రయాణికులు సౌకర్యార్ధం రైల్వే శాఖ ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. తాజాగా వెయిటింగ్ టికెట్లకు సంబంధించి రైల్వే శాఖ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇది ప్రయాణికులకు ఒకలాంటి షాకింగ్ విషయమే అని చెప్పవచ్చు. ఈ కొత్త రూల్ అమల్లోకి వస్తే జరిమానా మాత్రమే కాక ప్రయాణికులను రైలు నుంచి దింపేసేందుకు కూడా అధికారులకు అనుమతి లభించింది.
వివరాలు
ఇకపై వెయిటింగ్ లిస్ట్ టికెట్తో రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణిస్తే భారీ జరిమానా విధించడమే కాక ఏకంగా రైలు నుంచి దింపేయడం జరుగుతుందని రైల్వే ప్రకటించింది.టికెట్ కన్ఫార్మ్ చేసుకున్న ప్రయాణికుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. దీని వల్ల టికెట్ కన్ఫామ్ అయిన ప్రయాణికలు సౌకర్యవంతంగా ప్రయాణం చేసేందుకు అకాశం లభించనుంది. ఇప్పటికీ కొందరు రైలు ప్రయాణికులు టికెట్ కన్ఫార్మ్ కాకపోయినప్పటికీ వెయిటింగ్ టికెట్తో రిజర్వ్డ్ కోచ్ల్లో ప్రయాణం చేస్తుంటారు. టికెట్ బుక్ చేసుకున్నారు కాబట్టి వెయిటింగ్ టికెట్కు కూడా ఎంతో కొంత చట్టబద్ధత ఉంటుందనే నమ్మకం వీరిది. టీటీ వచ్చి టికెట్ చెక్ చేసినప్పుడు వెయిటింగ్ టికెట్ చూపించి ఆ తర్వాత ఎంతో కొంత జరిమానా చెల్లించి రిజర్వ్డ్ బోగిల్లో దర్జాగా ప్రయాణం చేస్తుంటారు.రైల్వే తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం ఇకపై ప్రయాణికులు వెయింటిగ్ టికెట్‌తో ఇలా రిజర్వ్డ్ బోగిల్లో ప్రయాణించడం కుదరదు. టికెట్ కన్ఫార్మ్ కాకుండా ప్రయాణం చేస్తే ఫుల్ టికెట్ ధరతో పాటుగా ఫైన్ కట్టాల్సి ఉంటుంది. అలాంటి ప్రయాణికులను రైలు నుంచి దించేసే అధికారం ట్రైన్ టికెట్ ఎగ్జామినర్‌కు (టీటీఈ) ఉంది.

దూరానికి
కన్ఫర్మ్ టికెట్ లేకుండా ఏసీ, స్లీపర్ బోగీల్లో ప్రయాణిస్తే స్లీపర్‌కి 250 రూపాయలు, ఏసీకి 440 రూపాయల జరిమానాతో పాటుగా వారు అప్పటి వరకు ప్రయాణించిన దూరానికి ఛార్జీలు చెల్లించాలి. మే 1, 2025 నుంచి రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. అంటే ఇకపై రిజర్వ్డ్ సీట్లలో ప్రయాణించే అర్హత కన్ఫర్మ్డ్ టికెట్స్ ఉన్న ప్రయాణికులకు మాత్రమే ఉంటుంది. కాదని ప్రయాణాలు చేస్తే నిర్దాక్షిణ్యంగా దింపేస్తారు. కొన్ని రోజుల క్రితం టికెట్ల బుకింగ్ టైమింగ్ మారినట్లు కొన్ని రోజుల క్రితం జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయతే అది వాస్తవం కాదని రైల్వే శాఖ తెలిపింది.
Read Also :Chinmoy Krishna Das: చిన్మయి కృష్ణదాస్ మళ్లీ అరెస్ట్..కారణం ఏమిటి ?