సెంట్రల్ గవర్నమెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో చేయబోయే జనాభా లెక్కింపులో కుల గణనను కూడా చేర్చాలని ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన రాజకీయ వ్యవహారాల కేంద్ర కమిటీలో నిర్ణయించారు. ఈ విషయాన్ని నేరుగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. త్వరలోనే జనాభా లెక్కలు జరగబోతున్నాయని అందులోనే కుల గణనను కూడా చేర్చబోతున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా కుల గణను పేరుతో కాంగ్రెస్ సర్వే చేయించిందని అందులో ఏమాత్రం పారదర్శకత లేదని పేర్కొంది. ఈరోజు కేంద్ర కాబినేట్‌లో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన పూర్తి వివరాలను వివరించారు.బుధవారం రోజు ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన రాజకీయ వ్యవహారాల కేంద్ర కమిటీ భేటీ నిర్వహించింది. ఈ సమావేశం అనంతరం కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన వివరాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. 2010లో నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కుల గణన అంశాన్ని పరిశీలించాలని చెప్పారని గుర్తు చేశారు. ఈక్రమంలోనే నేటీ భేటీలో కుల గణనను జాతీయ జనాభా లెక్కల్లో చేర్చాలని నిర్ణయించినట్లు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడూ.. కుల గణనను వ్యతిరేకించాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. అలాగే చాలా రాజకీయ పార్టీలు కుల గణనను సిఫార్సు చేశాయన్నారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ కోణంలో కుల సర్వేలు చేశాయని విమర్శించారు.
సందర్భంగా
తాజాగా దీనిపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ కేంద్రానికి కులణన రూపకల్పనలో తాము సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తెలంగాణ కులగణన బిహార్‌లో జరిగిన గణన కంటే పూర్తిగా భిన్నమని, అయినా దేశంలోనే బిహార్ మొదటిదని పేర్కొన్నారు. కానీ, తెలంగాణ కులగణన నమూనాను అనుసరించాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయాన్ని సాధించడానికి తాము చేపట్టబోయే మూడు కీలక దశలతో కూడిన విస్తృత దృక్పథాన్ని రాహుల్ ఈ సందర్భంగా వెల్లడించారు.‘కుల గణన ఒక అభివృద్ధికి కొత్త దిశ’ అని పేర్కొంటూ ఇది మేము ఇచ్చిన హామీ ఇప్పుడు వారు (కేంద్రం) స్వీకరించడం సంతోషకరం’ అన్నారు. అయితే, తమ పార్టీ ఇంకా ముందుకు వెళ్లి ‘90 శాతం ప్రజల భాగస్వామ్యం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలనుకుంటుంది’ అని అన్నారు.

ఒత్తిడి
కులగణన చేయాలని మేము ప్రభుత్వం మీద సరైన ఒత్తిడి తీసుకొచ్చాం ఇప్పుడు దానికి నిర్ధిష్ట సమయం కోరుతున్నాం అలాగే రిజర్వేషన్లపై 50% పరిమితిని తొలగించేందుకు మరింత ఒత్తిడి తేవాలని చూస్తున్నాం’ అన్నారు.మోదీ అకస్మాత్తుగా 11 ఏళ్ల తర్వాత కులగణనపై ప్రకటన చేశారు. దీనికి మేం సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. అయితే దీన్ని ఎప్పటిలోపు పూర్తి చేస్తారో తెలుసుకోవాలని భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు. అలాగే, ఆర్టికల్ 15(5) ప్రకారం ప్రైవేట్ విద్యాసంస్థల్లో రిజర్వేషన్ అమలును కూడా వెంటనే ప్రారంభించాలని కోరారు. ఇప్పటికే దీనిపై చట్టం ఉంది కానీ అమలు చేయలేదని రాహుల్ తెలిపారు.
Read Also: Pahalgam: ఉగ్ర ఘటనపై పాకిస్థాన్ కు అమెరికా షాక్..