हिन्दी | Epaper

Naa Anvesh: లేడీ అఘోరి పై సంచలన వ్యాఖ్యలు చేసిన నా అన్వేషణ

Anusha
Naa Anvesh: లేడీ అఘోరి పై సంచలన వ్యాఖ్యలు చేసిన నా అన్వేషణ

కొన్ని నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో వివిధ కార్యక్రమాలతో కలకలం సృష్టించిన అఘోరీ అలియాస్‌ అల్లూరి శ్రీనివాస్‌ను సైబరాబాద్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మంచిర్యాల జిల్లా కృష్ణపల్లికి చెందిన అఘోరీ అలియాస్‌ శ్రీనివాస్‌ రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం ప్రొద్దుటూరులోని ప్రగతి రిసార్ట్స్‌లో ఉండే మహిళ దగ్గర పూజలు చేయాలని చెప్పి రూ.9.80 లక్షలు వసూలు చేశారు. పూజకు మరిన్ని డబ్బులు కావాలని డిమాండ్ చేయడంతో మహిళ మోసపోయానని గ్రహించింది. దీంతో మోకిల పోలీసులకు ఫిబ్రవరిలో ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది.ఈ కేసు దర్యాప్తులో ఉండగానే అఘోరీ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతిని పెళ్లి చేసుకుని రాష్ట్రం విడిచి వెళ్లాడు. సైబరాబాద్‌ పోలీసులు అఘోరీని పట్టుకోవడానికి స్పెషల్‌ బృందాన్ని ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలతో ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల సరిహద్దులో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. బుధవారం నగరానికి తీసుకొచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం చేవెళ్ల కోర్టుకు తరలించగా, 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. దీంతో సంగారెడ్డి జిల్లాలోని కంది సబ్‌ జైలుకు తరలించారు. అక్కడి నుంచి చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించి, ప్రత్యేక బ్యారక్‌లో అఘోరీని పెట్టారు.

శ్రీనివాస్

లేడీ అఘోరి పై నా అన్వేషణ తాజాగా స్పందించాడు,ప్రపంచ యాత్రను ముగించేసిన అన్వేష్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్స్‌పై వీడియోలు చేస్తున్నాడు. వారి బండారాన్నిమోసాన్ని బహిర్గతం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే లేడీ అఘోరీగా ఫేమస్ అయిన శ్రీనివాస్‌ బ్యాకెండ్ స్టోరీ చెబుతూ ఓ వీడియో చేశాడు అన్వేష్.అఘోరీ అసలు పేరు శ్రీనివాస్‌ అని అతను శ్రీనివాస్‌ నుంచి నాగసాధుగా నాగ సాధు నుంచి లేడీ అఘోరీగా ఎలా మారాడన్నది వివరించాడు. కటిక పేదరికంతో మగ్గిపోతున్న శ్రీనివాస్ అలియాస్ లేడీ అఘోరీ తన చిన్నతనంలో సైకిల్ తొక్కుతూ ప్రమాద వశాత్తు తన ప్రైవేట్ పార్ట్స్‌ను కోల్పోయాడని చెప్పాడు.ముంబయ్‌లోని హిజ్రాలతో చేరిన శ్రీనివాస్ హిందూ ధర్మాన్ని అడ్డుపెట్టుకుని భారీగా సంపాదించొచ్చు అంటూ ప్లాన్ చేసుకున్నాడని అన్వేష్ వివరించాడు.ఆ ఫ్లాన్లో భాగంగా నాగ సాధు వేషం వేశాడని ఆ వేషతోనే గట్టిగా సంపాదించి కార్‌ కొనుకున్నాడని డబ్బు కోసం ఇద్దరు ముగ్గరు అమ్మాయిలను ట్రాప్‌ చేశాడని ఆరోపించాడు. దాంతో పాటే ఆ పూజలు ఈ పూజలు అంటూ అమాయకుల నుంచి భారీగా డబ్బు దండుకునే వాడన్నాడు.

 Naa  Anvesh: లేడీ అఘోరి  పై సంచలన వ్యాఖ్యలు చేసిన నా అన్వేషణ

డబ్బు కోసమే

సోషల్ మీడియాలోనూ ఎంట్రీ ఇచ్చి పాపులర్ అయ్యాడని బెట్టింగ్ యాప్స్‌ ను ప్రమోట్ చేసి బ్యాంకు నింపుకున్నాడని చెప్పాడు అన్వేష్. అలా అలా ఇప్పుడు లేడీ అఘోరీగా మారి తెలుగు టూ స్టేట్స్‌ మీద పడ్డాడన్నాడు. ఈ క్రమంలోనే వర్షిణిని ట్రాప్ చేశాడని చెప్పాడు అన్వేష్. వర్షిణి కూడా డబ్బు కోసమే లేడీ అఘోరీ వెంటే ఉందని ఆమె తీరును కూడా విర్శించాడు. హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకుని ఆ ధర్మాన్ని నమ్మేవాళ్లను మోసం చేయడమే శ్రీనివాస్ అలియాస్ లేడీ అఘోరీ పని అంటూ చెప్పాడు. అందుకే శ్రీనివాస్‌ను ఎవరూ నమ్మకండని తన వీడియోలో రిక్వెస్ట్ చేశాడు అన్వేష్‌.

Read Also: TamilNadu: తమిళనాడులో మయోన్నైస్ నిషేధం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870