हिन्दी | Epaper

Marriage Registration Rules: గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం

Aanusha
Marriage Registration Rules: గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం

గుజరాత్‌లో పారిపోయిన జంటల వివాహ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేయనున్నట్లు రాష్ట్ర డిప్యూటీ సీఎం హర్ష్ సంఘవి ప్రకటించారు. ఇటీవల ‘లవ్ జిహాద్’ పేరుతో నమోదవుతున్న కేసుల సంఖ్య పెరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ‘దేశంలో వివాహం ఓ పవిత్ర ఆచారం. మన కుమార్తెలను తప్పుడు పేర్లతో మోసం చేస్తే సంస్కృతిపై ప్రభావం పడుతుంది. అది సమాజ పతనానికి దారితీస్తుంది. వివాహ పవిత్రతను కాపాడటమే మా లక్ష్యం’ అని స్పష్టం చేశారు.

Read Also: Uttar Pradesh: పోక్సో కేసులో UP స్పెషల్ కోర్టు సంచలన తీర్పు

Marriage Registration Rules: Gujarat government's key decision
Marriage Registration Rules: Gujarat government’s key decision

ప్రభుత్వం ఏం చెబుతోంది?

అసెంబ్లీలో హర్ష్ సంఘవి మాట్లాడుతూ.. “ప్రభుత్వం నిజమైన ప్రేమకు వ్యతిరేకం కాదు. కానీ, ప్రేమ పేరుతో సమాజాన్ని, సంస్కృతిని పతనం చేసే వారిని వదిలిపెట్టం” అని స్పష్టం చేశారు. ప్రేమ అనేది నమ్మకం మీద ఆధారపడి ఉండాలని, అది మోసంగా మారితే సమాజ విచ్ఛిన్నానికి దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశ వివాహ విలువలను రక్షించడమే తమ ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు.

వచ్చే 30 రోజుల్లో కొత్త నిబంధనలను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ లోపు సాధారణ ప్రజల నుండి, మేధావుల నుండి అభిప్రాయాలను సేకరించనున్నారు. పారిపోయి వచ్చే జంటల పెళ్లిళ్లను నమోదు చేసేటప్పుడు తల్లిదండ్రుల అనుమతి లేదా సాక్ష్యం వంటి అంశాలను చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే, గుజరాత్‌లో ఇకపై వివాహాల నమోదు ప్రక్రియ మరింత పారదర్శకంగా, కఠినంగా మారనుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870