हिन्दी | Epaper

Maharashtra: ఎన్సీపీ విలీనంపై శరద్ పవార్ క్లారిటీ

Saritha
Maharashtra: ఎన్సీపీ విలీనంపై శరద్ పవార్ క్లారిటీ

మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాల్లో పెను విషాదం చోటు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. బుధవారం రోజు జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ (Ajit Pawar) అకాల మరణం చెందగా ఆయన రాజకీయ వారసురాలిగా సతీమణి సునేత్రా పవార్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అయితే ఈ నియామకంపై అజిత్ పవార్ బాబాయ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి.

Read Also: Private Banks: ఫిబ్రవరి 12న బ్యాంకులు బంద్!

Maharashtra: ఎన్సీపీ విలీనంపై శరద్ పవార్ క్లారిటీ

శరద్ పవార్ వ్యాఖ్యలు చర్చనీయాంశం

ఒకవైపు పార్టీని మళ్లీ ఏకం చేయాలని అజిత్ పవార్ (Maharashtra) చివరి నిమిషం వరకు ప్రయత్నించిన వైనం వెలుగులోకి వస్తుండగా మరోవైపు కుటుంబానికి తెలియకుండానే రాజకీయ నిర్ణయాలు జరిగిపోతుండటంతో అంతా షాక్ అవుతున్నారు. శనివారం సాయంత్రం జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమం గురించి తనకు అసలు సమాచారమే లేదని, మీడియా ద్వారానే ఈ విషయం తెలుసుకున్నానని శరద్ పవార్ వెల్లడించడం సంచలనంగా మారింది.

అజిత్ పవార్ వారసురాలి ఎంపిక ప్రక్రియలో మిమ్మల్ని పక్కన పెట్టారా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు నాకు తెలియదు అని శరద్ పవార్ పొడిపొడిగా సమాధానం ఇచ్చారు. బారామతిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రమాణ స్వీకారానికి పవార్ కుటుంబం నుంచి ఎవరైనా హాజరవుతారా అనే అంశంపై కూడా తనకు స్పష్టత లేదని చెప్పారు. 2023లో ఎన్సీపీ రెండు వర్గాలుగా చీలిపోయినప్పటి నుంచి బాబాయ్, అబ్బాయిల మధ్య రాజకీయ దూరం కొనసాగుతోంది. అజిత్ పవార్ మరణంతో ఎన్సీపీలోని రెండు వర్గాల విలీనంపై జరుగుతున్న చర్చలు ఇప్పుడు విషాదకరంగా మారాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సీఎస్కే ఫ్యాన్స్‌కు పూనకాలే: చెపాక్‌లో ‘ROAR 26’ మెగా ఈవెంట్

సీఎస్కే ఫ్యాన్స్‌కు పూనకాలే: చెపాక్‌లో ‘ROAR 26’ మెగా ఈవెంట్

కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి ఆగ్రహం.. కారణం ఏంటో తెలుసా?

కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి ఆగ్రహం.. కారణం ఏంటో తెలుసా?

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది
2:14

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

బీడబ్ల్యూఎఫ్ కొత్త రూల్స్‌పై సైనా నెహ్వాల్ అసహనం

బీడబ్ల్యూఎఫ్ కొత్త రూల్స్‌పై సైనా నెహ్వాల్ అసహనం

📢 For Advertisement Booking: 98481 12870