పంజాబ్‌లో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. క్రమంలో లేడీ కానిస్టేబుల్ అమన్‌దీప్ కౌర్,థార్ కారులో ప్రయాణిస్తుండంగా బటిండాలోని బాదల్ రోడ్ లోని ఫ్లైఓవర్ పై పోలీసులు, యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఆమెను అడ్డగించారు. అనంతరం లేడీ కానిస్టేబుల్ కారులో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో గేర్ బాక్స్ నుండి 17 గ్రాములకు పైగా హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. ఆమె మాన్సాలో పోస్టింగ్ పొందగాఇటీవలే బటిండా పోలీస్ లైన్స్ కు బదిలీ అయ్యిందని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ పట్టుబడిన అనంతరం పోలీసులు కౌర్‌ను అరెస్టు చేశారు. ఒక రోజు రిమాండ్‌లోకి తీసుకుని విచారించామని పోలీసులు తెలిపారు.ఈ ఘటన అనంతరం పోలీసులు అమన్‌దీప్‌ను ఉద్యోగం నుంచి తొలిగించినట్లు అధికారులు తెలిపారు.
డ్రగ్స్ స్మగ్లింగ్
ఈ ఘటన అనంతరం అధికారులు ఆమె ఆస్తులపై కూడా దర్యాప్తు ప్రారంభించారు. అమన్‌దీప్ కౌర్‌కు మహేంద్ర థార్‌తోపాటు ఆడి, రెండు ఇన్నోవా కార్లు, బుల్లెట్ బైక్, రెండు కోట్ల విలువైన లగ్జరీ ఇల్లు, ఖరీదైన వస్తువులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో డ్రగ్స్ స్మగ్లింగ్ ద్వారా వాటిని కొనుగోలు చేసిందా? లేదా? అన్నది దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో ఆమెకు ఎవరైనా అధికారులు సహకరించారా?ఆమె వెనుక ఎవరెవరు ఉన్నారు? అనే విషయాలపై కూడా ఆరాతీస్తున్నారు.నగర డీఎస్పీ హర్బన్స్ సింగ్ ధాలివాల్ మాట్లాడుతూ, రహస్య సమాచారం ఆధారంగా, లాడ్లీ ధీ చౌక్ సమీపంలోని ఓవర్ బ్రిడ్జి కింద పోలీసు బృందం చెక్‌పాయింట్‌ను ఏర్పాటు చేసిందని అన్నారు. ఈ సమయంలో, అమన్‌దీప్ కారును ఆపి, థార్‌ను తనిఖీ చేసినప్పుడు, దాని నుండి 17.71 మి.గ్రా హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు.
పోలీసు రిమాండ్
అమన్‌దీప్ కౌర్ పంజాబ్ పోలీసు వర్గాలలో ‘ఇన్‌స్టా క్వీన్’గా పేరుపొందారు. పంజాబ్ పోలీసు యూనిఫామ్‌లో అనేక రీల్స్ చేసి, ప్రజలలో గుర్తింపు తెచ్చుకున్నారు.దీంతోపాటు ఆమె దాదాపు ప్రతిరోజూ రంగురంగుల దుస్తులు ధరించి రీల్స్ చేసి అప్‌లోడ్ చేస్తుండేవారు.అమన్‌దీప్ కౌర్ అరెస్ట్ అయిన తరువాత ఇన్‌స్టాలో ఆమెను అనుసరించేవారి సంఖ్య ఒక్కరోజులోనే 15వేలకు పెరిగింది.అమన్‌దీప్ కౌర్‌కు పెళ్ళయిందని, కొంతకాలంగా ఆమె భర్తకు దూరంగా ఉంటున్నారని పోలీసులు చెప్పారు.గతంలో డ్రగ్స్‌కు సంబంధించి ఆమెపై అనేక అనుమానాలు వ్యక్తమైనప్పటికీ, సరైన ఆధారాలు లేక పోలీసులు ఆమెపై చర్యలు తీసుకోలేదు.భటిండా పోలీసులు ఆమెకు ప్రభుత్వాస్పత్రిలో డోప్ టెస్ట్ చేయించగా, ఫలితం నెగిటివ్ అని వచ్చింది.అమన్‌దీప్ కౌర్‌ను పంజాబ్‌పోలీసులు భటిండాలోని న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, ఒకరోజు పోలీసు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చినట్టు డిఎస్పీ దలీవాల్ చెప్పారు.తనపై తప్పుడు అభియోగాలు మోపారంటూ తనను కోర్టులో హాజరుపరిచినప్పుడు అమన్‌దీప్ కౌర్ బిగ్గరగా అరిచారు.అమన్‌దీప్ కౌర్ ఆస్తులపై కూడా విచారణ జరుగుతోందని, అక్రమాస్తులు బయటపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఐజీ సుఖ్‌చైన్ చెప్పారు.
Also Read: Chandigarh: మహిళా పోలీస్ వాహనంలో డ్రగ్స్ పదవినుండి తొలగింపు