हिन्दी | Epaper

Karnataka: ఇదేం పిచ్చి? బుల్లెట్ బైక్ నడపడం రాదని భర్తకు విడాకులు..

Tejaswini Y
Karnataka: ఇదేం పిచ్చి? బుల్లెట్ బైక్ నడపడం రాదని భర్తకు విడాకులు..

Karnataka: (దొడ్డబళ్లాపుర) సాకులు వెతకడంలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. కానీ, కర్ణాటకలో ఓ మహిళ భర్తకు విడాకులు ఇవ్వడానికి చెప్పిన కారణం విని పోలీసులు సైతం అవాక్కయ్యారు. తన భర్తకు బుల్లెట్ బైక్ నడపడం రాదనే వింత నెపంతో సంసారాన్ని వదిలేసిన ఆమె, ఆపై వరుస పెళ్లిళ్లతో ముగ్గురు వ్యక్తులను బురిడీ కొట్టించింది.

Read Also: AP: పల్నాడు జిల్లా మాచర్లలో పిచ్చికుక్క బీభత్సం

Karnataka: Is this crazy? Husband gets divorced for not being able to ride a bullet bike..
Karnataka: Husband gets divorced for not being able to ride a bullet bike..(filed pic)

వింత సాకుతో విడాకులు

పోలీసుల వివరాల ప్రకారం.. దొడ్డబళ్లాపుర ప్రాంతానికి చెందిన సుధారాణికి గతంలో వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, తన భర్తకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్ నడపడం రాదని, అది తనకు ఇష్టం లేదని గొడవ పెట్టుకుంది. ఇదే కారణంతో మొదటి భర్తను, కన్న పిల్లలను వదిలేసి బయటకు వచ్చేసింది. మొదటి భర్త నుంచి విడిపోయిన తర్వాత ఆమె అనంతమూర్తి అనే వ్యక్తిని ట్రాప్ చేసి రెండో పెళ్లి చేసుకుంది. కొద్దిరోజులు కాపురం చేసిన తర్వాత అసలు స్వరూపం బయటపెట్టింది. అతని వద్ద నుంచి ఏకంగా రూ. 20 లక్షల నగదును కాజేసి పరారైంది.

మూడో వ్యక్తికి వల.. పోలీసులకు ఫిర్యాదు

అనంతమూర్తిని ముంచిన తర్వాత సుధారాణి చూపు కనకపురకు చెందిన మరో వ్యక్తిపై పడింది. అతడిని కూడా తన మాయమాటలతో లొంగదీసుకునే ప్రయత్నం చేసింది. అయితే, ఆమె మోసాలను గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ముగ్గురు వ్యక్తులను మోసం చేసిన ఈ ‘కిలాడీ లేడీ’పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేవలం బుల్లెట్ బైక్ రాదన్న కారణంతో మొదలైన ఆమె మోసాల పర్వం ఇప్పుడు కటకటాల వరకు చేరింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సీఎస్కే ఫ్యాన్స్‌కు పూనకాలే: చెపాక్‌లో ‘ROAR 26’ మెగా ఈవెంట్

సీఎస్కే ఫ్యాన్స్‌కు పూనకాలే: చెపాక్‌లో ‘ROAR 26’ మెగా ఈవెంట్

కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి ఆగ్రహం.. కారణం ఏంటో తెలుసా?

కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి ఆగ్రహం.. కారణం ఏంటో తెలుసా?

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది
2:14

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

బీడబ్ల్యూఎఫ్ కొత్త రూల్స్‌పై సైనా నెహ్వాల్ అసహనం

బీడబ్ల్యూఎఫ్ కొత్త రూల్స్‌పై సైనా నెహ్వాల్ అసహనం

📢 For Advertisement Booking: 98481 12870