हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

IRCTC: రైలు టికెట్లు రద్దు ఛార్జీల పై.. ఐఆర్‌సీటీసీ క్లారిటీ

Anusha
IRCTC: రైలు టికెట్లు రద్దు ఛార్జీల పై.. ఐఆర్‌సీటీసీ క్లారిటీ

రైల్వే ప్రయాణాలు భారతదేశంలో కోట్లాది మంది ప్రజలకు ముఖ్యమైనదిగా మారాయి. చాలా మంది రోజూ రైళ్లలో ప్రయాణిస్తుంటారు. అందుకే దూర ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారు ముందుగానే రిజర్వేషన్ చేసుకుంటారు. అయితే, అనేక సందర్భాల్లో మనం బుక్ చేసిన టికెట్లను రద్దు చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. అంతేకాకుండా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టికెట్లు కూడా చివరి నిమిషంలో క్యాన్సిల్ (cancel) అవుతూ ఉంటాయి.అయితే ఇలాంటి సందర్భాల్లో డబ్బులు ఎన్ని కట్ అవుతాయి అనే సందేహాలు చాలా మంది ప్రయాణికుల్లో ఉంటాయి. ఇదే సమయంలో డబ్బులు ఎంత కట్ అవుతాయో, రిఫండ్ వస్తుందా అన్న విషయాల్లో అనేక సందేహాలు ప్రయాణికుల్లో ఉంటాయి. ఈ నేపథ్యంలో ఐఆర్‌సీటీసీ (IRCTC) తాజాగా స్పష్టతనిచ్చింది.టికెట్ రద్దు చేసినప్పుడు లేదా వెయిట్‌లిస్ట్ టికెట్లు ఆటోమేటిక్‌గా రద్దయిన సందర్భాల్లో తమ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయబడవని ఐఆర్‌సీటీసీ స్పష్టం చేసింది.

ఛార్జీని మినహాయించి

ఈ మేరకు ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ క్లారిటీగా వివరాలు వెల్లడించింది. ట్రైన్ టికెట్ బుక్ చేసే సమయంలో ఆన్‌లైన్ సేవల కోసం ఐఆర్‌సీటీసీ వసూలు చేసే నామమాత్రపు కన్వీనియన్స్ ఫీజును టికెట్ రద్దు అయితే తిరిగి చెల్లించడం జరగదని తెలిపింది. ఎందుకంటే ఐఆర్‌సీటీసీ ద్వారా ఆన్‌లైన్ బుకింగ్ సేవలు (Online booking services) ఇప్పటికే అందించబడినందున వాటిని తిరిగి ఇవ్వలేమని వెల్లడించింది.ఒకవేళ కన్ఫర్మ్ అయిన టికెట్‌ను రద్దు చేసినప్పుడు రైల్వే రిఫండ్ రూల్స్ పాలసీ ప్రకారం పీఆర్ఎస్ (ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్) ద్వారా రూ. 60 క్లర్కేజ్ ఛార్జీని మినహాయించి మిగిలిన డబ్బును చెల్లిస్తామని ఐఆర్‌సీటీసీ పేర్కొంది. ఈ క్లర్కేజ్ ఛార్జీ ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసిన టికెట్లకు రైల్వే కౌంటర్ల వద్ద బుక్ చేసిన టికెట్లకు ఒకే విధంగా ఉంటుందని స్పష్టం చేసింది.

తప్పుడు సమాచారం

అంటే ఈ క్లర్కేజ్ ఛార్జీని ఐఆర్‌సీటీసీ నేరుగా తీసివేయదని ఇది రైల్వే శాఖ సాధారణ రిఫండ్ నిబంధనల్లో భాగమని తేల్చి చెప్పింది.రైలు టికెట్ల రద్దు, వెయిట్‌లిస్ట్ టికెట్లు (Waitlist tickets are automatic) ఆటోమేటిక్‌గా రద్దు అయినపుడు ప్రయాణికుల నుంచి వస్తున్న ఫిర్యాదులు వాటి కారణంగా సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు సమాచారం నేపథ్యంలో దీనిపై ఒక క్లారిటీ ఇచ్చేందుకు ఐఆర్‌సీటీసీ ఈ ట్వీట్ చేసింది. రైల్వే ప్రయాణికులు ఛార్జీల పట్ల గందరగోళానికి గురవడం లేదా ఐఆర్‌సీటీసీ (IRCTC) అదనంగా, అసంబద్ధమైన ఛార్జీలను వసూలు చేస్తుందని తప్పుగా భావించడం వంటివి జరుగుతున్నాయనే వాదనలు వెల్లువెత్తుతున్న వేళ క్లారిటీ ఇచ్చింది. ఇలా వివరణ ఇవ్వడం ద్వారా ఐఆర్‌సీటీసీ తమ కార్యకలాపాల్లో పారదర్శకతను పెంచాలని, ప్రయాణికుల నమ్మకాన్ని పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Read Also: Nara Lokesh: బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో లోకేశ్‌ భేటీ..ఏఐ టూల్స్ వినియోగంపై చర్చ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870