हिन्दी | Epaper

Supreme Court: మంత్రి పదవే కావాలనుకుంటే జైలుకి రావాల్సిందే:సుప్రీంకోర్టు

Anusha
Supreme Court: మంత్రి పదవే కావాలనుకుంటే జైలుకి రావాల్సిందే:సుప్రీంకోర్టు

సెంథిల్ బాలాజీకి సుప్రీం కోర్టు అనేక ప్రశ్నలు సంధించింది. ముఖ్యంగా నగదు మోసం కేసులో 2023లో ఆయన అరెస్ట్ కాగా 2024 సెప్టెంబర్ నెలలో బెయిల్‌పై బయటకు వచ్చారు. మరుసటి రోజే మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే బెయిల్ మంజూరు చేసేటప్పుడు మంత్రి పదవి స్వీకరించడానికి తాము అనుమతి ఇవ్వలేదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. మీకు మంత్రి పదవి కావాలా, బెయిల్ కావాలా అనేది మీరే తేల్చుకొని చెప్పాలని వివరించింది. ఒకవేళ మంత్రి పదవే కావాలనుకుంటే మళ్లీ జైలుకి రావాల్సిందేనని స్పష్టం చేసింది.పూర్తి వివరాలు.2023 జూన్ నెలలో తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ నగదు మోసం కేసులో అరెస్ట్ అయ్యారు. ఈడీయే నేరుగా ఆయన్ను అదుపులోకి తీసుకుని జైల్లో పెట్టింది. అయితే బెయిల్ కావాలంటూ ఆయన సుప్రీం కోర్టుకు వెళ్లగా న్యాయస్థానం విచారణ జరిపింది. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం సెంథిల్ బాలాజీకి బెయిల్ మంజూరు చేసింది. ఇలా ఆయన 2024 సెప్టెంబర్ నెలలో బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే మరుసటి రోజే మంత్రి పదవిలో చేరి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో సెంథిల్ బాలాజీకి మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు అయింది.

న్యాయవాది

ఈ పిటిషన్‌పై బుధవారం రోజు అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. సెంథిల్ బాలాజీ సాక్ష్యాలను తారుమారు చేసేందుకు యత్నిస్తున్నట్లు ఈడీ తరఫు న్యాయవాది వాదించారు. సాక్ష్యాలను తారుమారు చేస్తారనే భయం ఉంటే కేసు మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని సెంథిల్ బాలాజీ తరఫు న్యాయవాది కోరారు. అయితే ఆయనకు బెయిల్ మంజూరు చేసిన సమయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి అనుమతి లేదని జస్టిస్ అభయ ఎస్ ఓక, జస్టిస్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. మంత్రిగా లేకపోవడంతోనే ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు ఓకే చెప్పినట్లు తెలిపింది.

 Supreme Court: మంత్రి పదవే కావాలనుకుంటే జైలుకి రావాల్సిందే:సుప్రీంకోర్టు

విచారణ

సెంథిల్ బాలాజీకి బెయిల్ కావాలా లేదా మంత్రి పదవి కావాలా అనేది సోమవారం నాటికి తెలియజేయాలని సూచించింది. ఒకవేళ మంత్రి పదవి మాత్రమే కావాలనుకుంటే కచ్చితంగా మళ్లీ జైలుకే వెళ్లాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. అలాగే విచారణను ఏప్రిల్ 28వ తేదీకి వాయిదా వేసింది. మరి సెంథిల్ బాలాజీ మంత్రి పదవి కోరుకుంటారా లేక బెయిలే కావాలని కోర్టుకు వెళ్తారా అనేది తెలియాలంటే మరో మూడు, నాలుగు రోజులు వేచి చూడాలి.మరోవైపు, సెంథిల్ బాలాజీ గతంలో ఒక ప్రకటనలో ఇలా పేర్కొన్నారు”సుప్రీం కోర్టు విధించిన బెయిల్ షరతులను నేను ఉల్లంఘించలేదు. ప్రజల మద్దతుతో వచ్చిన ఓటింగ్ ఫలితాలపై రాజకీయ పదవిని చేపట్టడం తప్పేమీ కాదు. దానికి నన్ను దోషిగా చూపడం అన్యాయం.”ఈ అంశం తమిళనాడు రాజకీయాల్లో, కేంద్ర-రాష్ట్ర సంబంధాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Read Also: TamilNadu: తమిళనాడులో మయోన్నైస్ నిషేధం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870