మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులు ఏటా ఎదురుచూసే బడ్జెట్ (Budget 2026) సమయం రానే వచ్చింది. దేశ వ్యాప్తంగా సామాన్యుడు ఆశించేది ఒక్కటే.. తన చేతిలో నాలుగు రాళ్లు ఎక్కువ మిగలాలని. పెరిగిన ధరలు, పెరుగుతున్న వడ్డీ రేట్ల నేపథ్యంలో, ఈ సారి ప్రభుత్వం పన్ను స్లాబుల్లో మార్పులు చేసి సామాన్యుడికి భారీ ఊరటనిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆదాయపు పన్ను వసూళ్లు రికార్డు స్థాయిలో ఉండటంతో.. ప్రజలకు కొంత వెసులుబాటు కల్పించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. హోమ్ లోన్ వడ్డీపై రాయితీ పెరగనుందా? చాలా ఏళ్లుగా గృహ రుణ గ్రహీతలు ఒకే విన్నపం చేస్తున్నారు. ప్రస్తుతం హోమ్ లోన్ వడ్డీపై రూ. 2 లక్షల వరకు మాత్రమే మినహాయింపు ఉంది. కానీ, ప్రస్తుత రియల్ ఎస్టేట్ ధరలు, వడ్డీ రేట్లు చూస్తుంటే ఇది ఏ మూలకూ సరిపోవడం లేదు. అందుకే ఈ పరిమితిని రూ. 2 లక్షల నుండి రూ. 5 లక్షలకు పెంచాలని డిమాండ్ వినిపిస్తోంది.
Read Also: Budget 2026: బడ్జెట్ 2026లో పాత పన్ను విధానం రద్దా?

మహిళా సాధికారతకు ప్రాధాన్యత
మహిళా పన్ను చెల్లింపుదారులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం.. ఈ బడ్జెట్ లో మహిళా ఉద్యోగులకు లేదా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక పన్ను మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కెరీర్ బ్రేక్ తీసుకున్న మహిళలు మళ్లీ ఉద్యోగాల్లో చేరినప్పుడు వారికి పన్ను రాయితీలు ఇవ్వాలని, మహిళా స్టార్టప్ లకు తక్కువ పన్ను రేట్లు ఉండాలని ప్రతిపాదనలు అందుతున్నాయి. పాత పన్ను విధానం (Old Tax Regime) మారుతుందా? 2017-18 నుండి పాత పన్ను విధానంలో స్లాబులు దాదాపుగా స్తంభించిపోయాయి. పెరిగిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పాత విధానాన్ని ఎంచుకునే వారికి కూడా ఊరటనివ్వాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: