హైదరాబాద్ లో చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాద ఘటనలో 17మంది మృత్యువాత పడ్డారు. చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ వద్ద ఒక భవనంలో ఏసీ కంప్రెషర్ పేలడంతో ఈ ఘటన జరిగినట్టుగా భావిస్తున్నారు. ఘటనా స్థలంలోనే ముగ్గురు అగ్నికి ఆహుతి కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 14మంది మృత్యువాత పడ్డారు. ఇక ఈ భారీ అగ్నిప్రమాద ఘటనలో గాయపడిన వారికి మలక్ పేట యశోదలో, అపోలో, డిఆర్డిఓ ఆసుపత్రులలో చికిత్స అందిస్తున్నారు.ఈ ప్రమాద ఘటనపై భారతదేశ ప్రధాని మోదీ(Prime Minister Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుండి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల పరిహారం ప్రకటించారు.ప్రధాని మోదీ. అలాగే, గాయపడిన వారికి రూ. 50,000 ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలు ఈ దుఃఖం నుండి త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం బాధితులకు తక్షణ సహాయం అందిస్తుందని ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్(X) వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో సుమారు 30 మంది ఉండగా, 17 మంది మరణించారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
సానుభూతి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) భారీ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అగ్నిప్రమాద ఘటనపైన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి, గాయపడిన వారికి తక్షణ వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించి, ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.ఇదిలా ఉంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్, తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తదితరులు భారీ అగ్నిప్రమాద ఘటనలో చోటు చేసుకున్న విషాదం పైన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గుల్జార్ హౌస్ ప్రమాదం పైన స్పందించారు.హైదరాబాద్లోని గుల్జార్ హౌస్ వద్ద అత్యంత విషాదకరమైన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
Read Also: Sports: కోహ్లీ లాంటి క్రికెటర్లకు భారత్‌లో కొదువ లేదు: అసదుద్దీన్ ఒవైసీ