हिन्दी | Epaper

కొంప ముంచిన గూగుల్ మ్యాప్..కాలువలో పడి వ్యక్తి దుర్మరణం

Vanipushpa
కొంప ముంచిన గూగుల్ మ్యాప్..కాలువలో పడి వ్యక్తి దుర్మరణం

గూగుల్ మ్యాప్స్‌ నమ్మి ప్రాణాలు కోల్పోయాడు ఓ వ్యక్తి. తన కారుతో సహా 30 అడుగుల లోతైన కాలువలో పడి దుర్మరణం చెందాడు. నోయిడాలో ఈ ఘటన వెలుచూసింది. ఆ మ్యాప్ తప్పు మార్గాన్ని చూపించి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. కానీ పోలీసులు ఈ ఘటనపై ఎలాంటి ప్రకటన చేయలేదు. మృతుడిని ఢిల్లీలోని మండవలి నివాసి భరత్ సింగ్( 31) గా గుర్తించారు. ఆయన స్టేషన్ మాస్టర్‌గా పనిచేస్తున్నారని వార్తా సంస్థ పిటిఐ వెల్లడించింది. ఈ సంఘటన మార్చి 1వ తేదీ శనివారం గ్రేటర్ నోయిడాలోని సెక్టార్ P4లో జరిగిందని పోలీసులు తెలిపారు. భరత్ సింగ్ ఒక వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది.

పోలీసులకు సమాచారం

శనివారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో కేంద్రీయ విహార్ ప్రాంతం సమీపంలోని కాలువలో కారు పడిపోయినట్లు పోలీసులకు సమాచారం అందిందని బీటా 2 పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి విజయ్ కుమార్ తెలిపారు. భరత్ సింగ్ రాణి రాంపూర్‌లో ఒక వివాహ కార్యక్రమానికి వెళుతుండగా ప్రమాదం జరిగిందని కుమార్ తెలిపారు. రోడ్డు చివర ఎటువంటి హెచ్చరిక బోర్డులు లేవని, దీనివల్ల కారు నియంత్రణ కోల్పోయి కాలువలో పడి ఉండే అవకాశం ఉందని ఆయన అన్నారు.

హెచ్చరిక బోర్డులు లేవు
కారు వేగంగా వెళుతోందని, అకస్మాత్తుగా కాలువలో పడిపోయిందని ప్రత్యక్ష సాక్షి సౌరభ్ తెలిపారు. స్థానికులు సహాయం చేసేందుకు ప్రయత్నం చేశారు. కానీ కారు బోల్తా పడి నీటితో నిండిపోయింది. కాలువల దగ్గర హెచ్చరిక బోర్డులు లేకపోవడం ప్రమాదాలకు కారణమవుతుందని స్థానికులు చెబుతున్నారు. కాగా భరత్ సింగ్ గూగుల్ మ్యాప్స్ సహాయంతో నావిగేట్ చేస్తున్నప్పుడు డెడ్ ఎండ్ వద్ద ప్రమాదం జరిగి ఉండవచ్చని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గుండె నిండా దుఃఖం అయినా పరీక్ష రాసిన వైనం

గుండె నిండా దుఃఖం అయినా పరీక్ష రాసిన వైనం

పెళ్ళికి నిరాకరించిందని.. యువతికి ఎయిడ్స్ ఇంజక్షన్

పెళ్ళికి నిరాకరించిందని.. యువతికి ఎయిడ్స్ ఇంజక్షన్

📢 For Advertisement Booking: 98481 12870