हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Rahul Gandhi: మాతృభాషలతో పాటు ఆంగ్ల విద్య అవసరం: రాహుల్

Vanipushpa
Rahul Gandhi: మాతృభాషలతో పాటు ఆంగ్ల విద్య అవసరం: రాహుల్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) విద్యార్థులకు ఆంగ్ల భాషా నైపుణ్యం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ప్రపంచ వేదికపై పోటీ పడాలనుకునే ప్రతి విద్యార్థికి ఆంగ్ల పరిజ్ఞానం ఎంతో కీలకమని, ఇది వారి సాధికారతకు చిహ్నమని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా(AmithSha) చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ విధంగా స్పందించారు. ఆంగ్ల భాష నేర్చుకోవడం సిగ్గుపడాల్సిన విషయం కాదని రాహుల్ గాంధీ అన్నారు. విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా, మెరుగైన ఉపాధి అవకాశాల(Jobs) ను కూడా ఆంగ్ల భాష కల్పిస్తుందని ఆయన తెలిపారు. మాతృభాషకు ఎంత ప్రాధాన్యత ఉందో, ప్రస్తుత ప్రపంచంలో రాణించడానికి ఆంగ్లానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉందని ఆయన అన్నారు. ప్రతి విద్యార్థికి మాతృభాష(Mothertonge)తో పాటు ఆంగ్లంలో కూడా తర్ఫీదు ఇవ్వాల్సిన అవసరాన్ని ఆయన గుర్తుచేశారు.

Rahul Gandhi: మాతృభాషలతో పాటు ఆంగ్ల విద్య అవసరం: రాహుల్
Rahul Gandhi: మాతృభాషలతో పాటు ఆంగ్ల విద్య అవసరం: రాహుల్

బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లపై రాహుల్ గాంధీ విమర్శలు

ఈ సందర్భంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ల(BJP,RRS)పై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి, సమాజంలో సమానత్వాన్ని సాధించడం ఆ రెండు సంస్థలకు ఇష్టం లేదని ఆయన ఆరోపించారు. అందుకే వారు విద్యార్థులను విద్యకు దూరం చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలోని ప్రతి భాషకు దాని సొంత ఆత్మ, సంస్కృతి, జ్ఞాన సంపద ఉన్నాయని, వాటన్నింటినీ మనం గౌరవించాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అయితే, అదే సమయంలో ప్రపంచంతో సమర్థవంతంగా పోటీ పడేందుకు వీలుగా ఆంగ్ల విద్యను కూడా విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన సూచించారు.

విద్యార్థుల భవిష్యత్‌పై దృష్టి పెట్టాలి

ఒక కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, ఈ దేశంలో ఇంగ్లీషులో మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు వస్తాయని వ్యాఖ్యానించారు. మన దేశాన్ని, సంస్కృతిని, మతాన్ని అర్థం చేసుకోవడానికి ఏ పరాయి భాషా సరిపోదని, విదేశీ భాషలతో సంపూర్ణ భారతీయ భావనను ఊహించుకోలేమని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించారు. ‘‘భాషలపై పిచ్చి రాజకీయాలు కాకుండా, విద్యార్థుల భవిష్యత్‌పై దృష్టి పెట్టాలి’’ ‘‘భాషను భయంగా కాకుండా సాధనగా భావించాలి’’ ‘‘ఆంగ్ల భాషను పక్కన పెట్టకుండా, మాతృభాషలతో కలిపి సమతుల్యంగా అభివృద్ధి చేద్దాం’’ అని ఆయన అన్నారు.

Read Also: Primister :ఆర్జేడీ-కాంగ్రెస్‌ కూటమిపై నిప్పులు చెరిగిన ప్రధాని నరేంద్ర మోదీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870