हिन्दी | Epaper

ఢిల్లీలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఎన్నికలు

Vanipushpa
ఢిల్లీలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఎన్నికలు

ఢిల్లీలో శాసనసభ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమవ్వగా.. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్‌ జరగనుంది. దాదాపు 1.56 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం తొమ్మిది గంటల వరకు 8.10 శాతం ఓటింగ్ నమోదైనట్టు ఈసీ ప్రకటించింది. అత్యధికంగా ముస్తఫాబాద్ నియోజకవర్గంలో 12.43 శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించింది. ఈ క్రమంలోనే పోలింగ్ ప్రారంభమైన తొలి గంటల్లోనే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఢిల్లీ సీఎం ఆతిశీ, కేంద్ర మంత్రి జై శంకర్‌ సహా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

రాష్ట్రపతి ఎస్టేట్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ద్రౌపదీ ముర్ము ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాహుల్‌ గాంధీ నిర్మాణ్‌ భవన్‌లో ఓటు వేశారు. ఢిల్లీ సీఎం అతిశీ కాల్‌కాజీలో ఓటు వేయగా.. గవర్నర్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనా రాజ్‌ నివాస్‌ మార్గ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్రమంత్రి జై శంకర్‌.. తన సతీమణితో కలిసి తుగ్లక్‌ క్రెసెంట్‌లో ఓటు వేశారు. అలానే ఆప్‌ సీనియర్‌ నేత మనీశ్ సిసోడియా తన భార్యతో కలిసి వచ్చి ఓటు వేశారు. కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ తన కుటుంబసభ్యులతో కలిసి ఆనంద్‌ నికేతన్‌లో ఓటు వేశారు. భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేదీ, నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ దినేశ్ కె. త్రిపాఠీ కమ్రాజ్‌ లేన్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

నమాజ్ చేసే వారి సంఖ్యపై ఆంక్షలు చెల్లవు.. యూపీ ప్రభుత్వానికి షాక్.

నమాజ్ చేసే వారి సంఖ్యపై ఆంక్షలు చెల్లవు.. యూపీ ప్రభుత్వానికి షాక్.

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!

16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!

సోనమ్ వాంగ్‌చుక్ నిబంధనను రద్దు చేసిన కేంద్రం

సోనమ్ వాంగ్‌చుక్ నిబంధనను రద్దు చేసిన కేంద్రం

పోకో నుంచి పవర్‌ఫుల్ ఫోన్లు.. మార్చి 17న X8 Pro సిరీస్ లాంచ్!

పోకో నుంచి పవర్‌ఫుల్ ఫోన్లు.. మార్చి 17న X8 Pro సిరీస్ లాంచ్!

📢 For Advertisement Booking: 98481 12870