కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం వంటగ్యాస్ వినియోగదారులకు మరోసారి భారీగా ఆర్ధిక భారం మోపింది.గృహావసరాల కోసం వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరను ఒక్కసారిగా రూ.50 పెంచింది. ఈ ధరలు మంగళవారం తెల్లవారుజాము నుంచే అమలులోకి వస్తున్నాయని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.ఉజ్వల పథకానికి కూడా పెంపుదల వర్తింపజేసింది.కొద్దిసేపటి కిందటే దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచింది కేంద్ర ప్రభుత్వం. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై లీటర్ ఒక్కింటికి రెండు రూపాయల మేర పెంచింది. ఈ మేరకు ఆయిల్ కంపెనీలు ఓ ప్రకటన విడుదల చేశాయి. ఈ పెంపు- రిటైల్ అమ్మకాలకు వర్తించదంటూ పెట్రోలియం మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది.
సిద్ధరామయ్య స్పందన
ఈ పెంపుదలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఘాటుగా స్పందించారు. దీనికి కారణం లేకపోలేదు. ఇటీవలే కర్ణాటకలో డీజిల్ అమ్మకాలపై ఆయన ప్రభుత్వం రెండు రూపాయల మేర పన్నును పెంచింది. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమాలకు దిగింది రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ. రోడ్డెక్కి మరీ నిరసనలు చేపట్టింది. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఈ నిరసన ప్రదర్శనలు సాగాయి. ఇప్పుడు అదే బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లను రెండు రూపాయల మేర పెంచింది. అది సిద్ధరామయ్యకు అయాచిత అస్త్రంలా మారింది. దీనితో బీజేపీపై సెటైర్లు సంధించారాయాన. ఇప్పుడు ఎవరు? ఎవరి మీద ఆందోళనలు, ధర్నాలు దిగాలంటూ చురకలు అంటించారు.
శివకుమార్ స్పందన
అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గినప్పటికీ- బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై లీటరు ఒక్కింటికి రెండు రూపాయల మేర ఎక్సైజ్ ట్యాక్స్‌ను పెంచిందని, ఇది దేశ ప్రజలకు బహుమతిగా ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. కర్ణాటక బీజేపీ రాష్ట్రశాఖ ఇప్పుడు ఈ పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదలకు నిరసనగా ఢిల్లీలో తమ పార్టీ అధిష్ఠానం వద్ద నిరసనలు ప్రదర్శనలు నిర్వహిస్తుందా? లేక- కర్ణాటక ప్రభుత్వాన్ని తప్పుపట్టడానికి మాత్రమే పరిమితమౌతుందా? అంటూ సెటైర్లు వేశారు. ఇప్పుడు తాజాగా కర్ణాటక కాంగ్రెస్ కమిటీనేత, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా తెర మీదికి వచ్చారు. బీజేపీ రాష్ట్ర శాఖ నాయకులపై ఎదురుదాడికి దిగారు. డీజిల్‌పై మాత్రమే మూడు శాతం మేర అమ్మకపు పన్ను పెంచితే బీజేపీ నాయకులు ఆందోళనలు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారని, ఇప్పుడు కేంద్రం చేసిన పనికి ఆందోళనలు చేస్తారా? అంటూ నిలదీశారు.డీజిల్ ధరల పెంపుదలకు నిరసనగా జన్ ఆక్రోశ్ యాత్ర చేస్తోన్నందుకు బీజేపీ నాయకులందరినీ అభినందిస్తోన్నానని డీకే శివకుమార్ చెప్పారు.
Read Also: VijaySaiReddy:పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుదలపై స్పందించిన విజయసాయిరెడ్డి