VijaySaiReddy:పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుదలపై స్పందించిన విజయసాయిరెడ్డి

VijaySaiReddy:పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుదలపై స్పందించిన విజయసాయిరెడ్డి

కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం వంటగ్యాస్ వినియోగదారులకు మరోసారి భారీగా ఆర్ధిక భారం మోపింది.గృహావసరాల కోసం వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరను ఒక్కసారిగా రూ.50 పెంచింది. ఈ ధరలు మంగళవారం తెల్లవారుజాము నుంచే అమలులోకి వస్తున్నాయని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.ఉజ్వల పథకానికి కూడా పెంపుదల వర్తింపజేసింది.కొద్దిసేపటి కిందటే దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచింది కేంద్ర ప్రభుత్వం. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై లీటర్ ఒక్కింటికి రెండు రూపాయల మేర పెంచింది. ఈ మేరకు ఆయిల్ కంపెనీలు ఓ ప్రకటన విడుదల చేశాయి. ఈ పెంపు- రిటైల్ అమ్మకాలకు వర్తించదంటూ పెట్రోలియం మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది.

Advertisements

ముడి చమురు

పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుదలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ మాజీ సభ్యుడు వీ విజయసాయిరెడ్డి స్పందించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలతో కంపేర్ చేశారు. ఈ రేట్లను విశ్లేషించారు. క్రూడాయిల్ రేట్లు భారీగా తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం ఏ మాత్రం సరికాదని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర బ్యారెల్ ఒక్కింటికి 60 డాలర్ల కంటే దిగువకు చేరిందని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. రష్యా యురాల్స్ ముడి చమురు రేటు సైతం బ్యారెల్ ఒక్కింటికి 50 డాలర్ల కంటే తక్కువే పలుకుతోందని ఆయన వివరించారు. పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్ ఒక్కింటికి అయిదు రూపాయల వరకు తగ్గించడానికి అవకాశం ఉందని సాయిరెడ్డి చెప్పారు. పెట్రోల్ రేటు తక్కువగా ఉండటం- దేశ ఆర్థిక పరిస్థితికి ఓ ఉద్దీపనలా పని చేస్తుందని, ఎకనమిక్ గ్రోత్ ఇంజిన్‌గా మారుతుందని అన్నారు. ఈ మేరకు ఓ ట్వీట్ పోస్ట్ చేశారాయన. దీన్ని పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురికి ట్యాగ్ చేశారు.

 VijaySaiReddy:పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుదలపై స్పందించిన విజయసాయిరెడ్డి

ప్రతీకార సుంకాల

రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండబోదని క్లారిటీ ఇచ్చింది. ఈ ఎక్సైజ్‌ డ్యూటీ పెంపు వల్ల రిటైల్‌ ధరలపై ఎలాంటి ప్రభావం చూపబోదని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ఈ నిర్ణయంతో పెట్రోల్‌, డీజిల్‌ రిటైల్‌ ధరల్లో పెరుగుదల ఉండదని చమురు మార్కెటింగ్‌ కంపెనీలు సమాచారం ఇచ్చినట్లు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వశాఖ ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర 60డాలర్లుగా ఉందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ వెల్లడించారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న ప్రతీకార సుంకాల కారణంగా ట్రేడ్ వార్ వస్తుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. ఫలితంగా అంతర్జాతీయ ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ తరుణంలోనే ఎక్సైజ్ సుంకం పెంపు చోటుచేసుకుంది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినందు వల్ల ఈ అదనపు భారాన్ని చమురు సంస్థలు సర్దుబాటు చేసుకుంటాయని తెలుస్తోంది.

Also Read: Andhra pradesh: ఆంధ్రాలో హాల్ట్ స్టేషన్లు..

Related Posts
దావోస్ పర్యటనకు సిద్ధమైన సీఎం రేవంత్
CM Revanth is ready to visit Davos

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 20న దావోస్‌కు పర్యటనకు వెళ్లనున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక (వర్ల్డ్ ఎకనామిక్ ఫోరం) నిర్వహించే వార్షిక సదస్సులో ఆయన పాల్గొననున్నట్లు Read more

రేపు మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు: కాంగ్రెస్
రేపు మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు: కాంగ్రెస్

రేపు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు: కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ మరణం: "మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. అధికారికంగా ప్రకటిస్తాము…" Read more

Waqf Bill : వక్స్ బిల్లులోని కీలకాంశాలు
Waqf Amendment Bill 2

వక్స్ బిల్లులోని కీలక నిబంధనల ప్రకారం, వక్స్ బోర్డుల్లో సభ్యులుగా ముస్లింలకే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రత్యేకంగా, కనీసం ఇద్దరు మహిళలు ఈ బోర్డుల్లో సభ్యులుగా ఉండేలా నిబంధనలు Read more

వీరేంద్ర కుమార్‌తో డోలా భేటీ .
Dola met with Virendra Kumar.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావలసిన నిధులు విడుదల చేయాలని కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికారత శాఖ మంత్రి డా. వీరేంద్ర కుమార్‌తో ఏపీ మంత్రి డోలా శ్రీబాల Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×