हिन्दी | Epaper

DK Shivakumar : డీకేని సీఎంను చేయాలని హైకమాండ్‌కు ఎమ్మెల్యేల అభ్యర్థన!

Sudha
DK Shivakumar : డీకేని సీఎంను చేయాలని హైకమాండ్‌కు ఎమ్మెల్యేల అభ్యర్థన!

కర్ణాటక లో సీఎం పోస్టుపై మాటిమాటికి ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. సీఎం సిద్ధరామయ్య ను పదవి నుంచి తొలగించి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ (DK Shivakumar) కు సీఎం పగ్గాలు కట్టబెడుతారని మరోసారి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. డీకే శివకుమార్‌ను(DK Shivakumar) సీఎంను చేయమని 80 మందికిపైగా ఎమ్మెల్యేలు హైకమాండ్‌కు అభ్యర్థన చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయాన్ని ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్‌ వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. సీఎం పదవి విషయంలో డీకే శివకుమార్‌కు ఒక ఛాన్స్ ఇవ్వాలని 80 నుంచి 90 మందికిపైగా ఎమ్మెల్యేలు హైకమాండ్‌ను అభ్యర్థించారని ఇక్బాల్‌ హుస్సేన్‌ చెప్పారు. ఇప్పుడు ఈ నిర్ణయం అధిష్ఠానం చేతుల్లోనే ఉందని అన్నారు. తమది క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, దానికి తగ్గట్టే తాము ప్రవర్తించాలని చెప్పారు. ఆయన (సిద్ధరామయ్య కొడుకు యతీంద్ర సిద్ధరామయ్యను ఉద్దేశించి) తన తండ్రికి అనుకూలంగా పదేపదే మాట్లాడటం ఇబ్బందిగా ఉందని అన్నారు.

Read Also : http://EPFO – PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్

DK Shivakumar
DK Shivakumar

రాజకీయాల విషయానికి వస్తే.. క్రమశిక్షణే ముఖ్యమని ఇక్బాల్‌ హుస్సేన్‌ అన్నారు. తమ వ్యాఖ్యలతో ఇతరులను రెచ్చగొట్టాలని చూడటం సరికాదని చెప్పారు. డీకేకు ఒక అవకాశం ఇవ్వాలనేది తమ అందరి కోరిక అని తెలిపారు. అయితే దాని గురించి బహిరంగంగా ప్రకటనలు చేసి, గందరగోళం సృష్టించకూడదని అన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870