చైనా మాంజాపై అధికారుల హెచ్చరిక
Chinese Manja Ban: సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళ పిల్లలు, యువకులు పతంగులు ఎగురవేస్తూ సందడి చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజా వాడకంపై అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు.
చైనా మాంజా(Chinese Manja Ban) తయారీలో సీసం (Lead) వంటి హానికర పదార్థాలను ఉపయోగించడం వల్ల అది సన్నగా, మెరుస్తూ కనిపిస్తుందని అధికారులు తెలిపారు. అయితే ఈ మాంజా వాడకం తీవ్ర ప్రమాదాలకు దారి తీస్తుందని హెచ్చరించారు. ముఖ్యంగా మెడ, చేతులు, చెవి వంటి సున్నితమైన భాగాల్లో గాయాలు ఏర్పడి తీవ్ర రక్తస్రావం జరిగే అవకాశం ఉందన్నారు.
ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో పెట్టుకుని చైనా మాంజా విక్రయం, వినియోగంపై ప్రభుత్వం పూర్తిస్థాయి నిషేధం విధించిందని స్పష్టం చేశారు. కొత్త చట్టం ప్రకారం చైనా మాంజాను విక్రయించినా లేదా ఉపయోగించినా కఠిన శిక్షలు తప్పవని అధికారులు వెల్లడించారు. పండుగ వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: