ధడక్ సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత విభిన్న సినిమాలను ఎంచుకుంటూ నటిగా మంచి మార్కులు కొట్టేసింది.బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతున్న జాన్వీ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది.గతేడాది యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబోలో రాబోతున్న పెద్ది చిత్రంలో నటిస్తుంది. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ షాట్ గ్లింప్స్ అదిరిపోయింది.
మరో గిఫ్ట్
తాజాగా జాన్వీకి బిర్లా వారసురాలు అనన్య ఊహించని కానుక పంపించారు.రూ.5 కోట్లు విలువ చేసే లంబోర్గిని కారును జాన్వీకి కానుకగా పంపించింది,ఈ మేరకు శుక్రవారం ఉదయం పర్పుల్ కలర్ లంబోర్గిని కారును జాన్వీ నివాసానికి పంపించారు. ఆ కారుతోపాటు మరో గిఫ్ట్ సైతం అందులో ఉంచారు. దానిపై ప్రేమతో నీ అనన్య అని రాసి ఉంది. జాన్వీ నివాసానికి లంబోర్గిని కారు వెళ్తున్న విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
ఎవరీ అనన్య
అనన్య ప్రముఖ వ్యాపారవేత్త కుమార్ మంగళం కుమార్తె.ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ బోర్డ్ డైరెక్టర్లలో అనన్య ఒకరు. 17 ఏళ్ల వయసులోనే స్వతంత్ర మైక్రోఫిన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో తన మొదటి సంస్థను స్థాపించారు. బారత్ లోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న మైక్రోఫైనాన్స్ సంస్థల్లో ఇది కూడా ఒకటి. వ్యాపారవేత్తగానే కాకుండా అనన్య గాయనిగా కూడా ఫేమస్. పలు ప్రైవేట్ ఆల్బమ్స్ కోసం పనిచేశారు. అనన్య, జాన్వీ మంచి స్నేహితులు.అనన్య ఇటీవల సౌందర్య ఉత్పత్తుల వ్యాపారంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించారు.దీనికి జాన్వీకపూర్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండనున్నట్లు సమాచారం. తన బ్రాండ్ కోసం వర్క్ చేస్తున్నందుకు కానుకగా అనన్య ఈ ఖరీదైన కానుకను ఆమెకు పంపించారని వార్తలు వస్తున్నాయి.

లంబోర్గిని అనే పేరు వినగానే స్పోర్ట్స్ కార్లలో రాజుగా గుర్తించే మోడల్స్ గుర్తుకు వస్తాయి. అత్యాధునిక డిజైన్, స్పీడ్, విలాసవంతమైన ఫీచర్లతో ఉంటుంది.అందులోను రూ. 5 కోట్ల విలువ కలిగిన మోడల్ కావడం, ఈ వార్త సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.ఆమె ఫ్యాషన్, బ్రాండ్ ప్రమోషన్‌లలో కూడా క్రియాశీలంగా ఉంటుంది. ఈ బ్రాండ్ అంబాసిడర్ బాధ్యత కూడా ఆమెకు కొత్త అవకాశాలు తెచ్చే అవకాశం ఉంది.
Read Also: Ram Charan : కాంపా యాడ్ లో నటించిన గ్లోబల్ స్టార్