हिन्दी | Epaper

Pahalgam: పహల్గాం ఉగ్రదాడి స్పందించిన ఆలియా భట్,జాన్వీ కపూర్

Anusha
Pahalgam: పహల్గాం ఉగ్రదాడి స్పందించిన ఆలియా భట్,జాన్వీ కపూర్

కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడితో ఒక్కసారిగా భారత్ ఉలిక్కిపడింది. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్‌ ప్రాంతంలో విహారానికి వచ్చినవారిపై పాశవిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 28 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు స‌మాచారం.దాడికి తామే పాల్పడినట్టు ఉగ్రసంస్థ ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ ప్రకటించింది.2019లో పుల్వామా దాడి తర్వాత జమ్మూ లోయలో జరిగిన అత్యంత దారుణమైన దాడి ఇది. దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ కమిటీ (పిసిసి)తో సహా వివిధ పార్టీలు బుధవారం బంద్, నిరసనకు పిలుపునిచ్చాయి.దీంతో జమ్మూ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు.

ప్రత్యక్ష సాక్షి

ఫుడ్‌స్టాల్స్‌ వద్ద కొందరు, గుర్రాలపై స్వారీ చేస్తూ కొందరు, పచ్చిక బయలుపై కూర్చుని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మరి కొందరు పర్యాటకులు ఉన్న సమయంలో అడవిలో నుంచి హఠాత్తుగా ప్రత్యక్షమైన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మహిళలు, పిల్లలను వదిలిపెట్టి కంటికి కనిపించిన పురుషులను కాల్చుకుంటూ పోయారు. ముగ్గురు, నలుగురు ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాల్చవద్దని మహిళలు వేడుకుంటున్నా వారు కనికరించలేదు. ఇతను ముస్లిం కాదు కాల్చేయండి అని ఓ ఉగ్రవాది అన్నట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. భర్తను, ఆప్తులను కోల్పోయిన చాలా మంది మహిళలు సాయం కోసం స్థానికులను అర్థించే దృశ్యాలు వైరల్‌ అయ్యాయి.ట్రెక్కింగ్‌ ద్వారా మాత్రమే ఆ ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉన్నందున క్షతగాత్రులను తరలించడానికి సైనిక హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. భద్రతా ఏర్పాట్ల మధ్య ఇతర పర్యాటకులను అక్కడి నుంచి అధికారులు తరలించారు.పహల్గామ్‌ దాడిని ఖండిస్తూ సామాన్యుల దగ్గర నుంచి రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతున్నారు. ఉగ్రవాద దాడిలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నారు.

ప్రియాంక చోప్రా

ఈ ఉగ్రదాడి ఘటన మీద జాన్వీ కపూర్, అలియా భట్, కియారా అద్వానీ, ప్రియాంక చోప్రా, తమన్నా వంటి వారంతా కూడా స్పందించారు. వెకేషన్, హనీమూన్, సెలెబ్రేషన్స్ కోసం ఫ్యామిలీతో అక్కడకు వచ్చారంతా.. కాశ్మీర్ అందాల్ని చూసేందుకు వచ్చారంతా ఎంతో మంది అమాయకులి బలి అయ్యారు.. కుటుంబ సభ్యుల ముందే ప్రాణాలు తీశారు ఈ ఘటనను ఎప్పటికీ మర్చిపోలేం మానవత్వాన్ని ప్రశ్నించేలా ఈ ఘటన జరిగింది.. ఇది మనల్ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది ఈ ఘటనలో బాధింపబడ్డ వారందరికీ నా ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నాను ఎంతో బాధగా ఉంది అంటూ ప్రియాంక చోప్రా పోస్ట్ చేసింది.

ఏం తప్పు చేయకపోయినా ఎంతో మంది అమాయకుల ప్రాణాలు పోయాయి.. ఎంతో బాధగా ఉంది గుండె తరుక్కుపోతోంది చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలి వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి ప్రపంచంలో శాంతి నెలకొనాలని కోరుకుంటున్నాను అని తమన్నా ట్వీట్ చేసింది.

ఎంతో మంది అమాయక ప్రజల ప్రాణాలు పోయాయి,వారందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నాను మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలి గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలి ఈ ఘటన బాధితులకు దేవుడు శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని జాన్వీ కపూర్ పోస్ట్ చేసింది.పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటన గురించి తెలిసి గుండె ముక్కలైనట్టుగా అనిపించింది టూరిస్ట్, ఫ్యామిలీస్, కశ్మీర్ అందాల్ని చూసేందుకు వచ్చిన ఎంతో మంది అమాయకపు ప్రజల్ని చంపేశారు ఇప్పుడు అక్కడ శోకసంద్రం మాత్రమే మిగిలింది ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే మానవత్వం అనేది అసలు ఉందా? అని అనిపిస్తుంటుంది ఆ భగవంతుడు అందరికీ శక్తిని ప్రసాదించాలని, ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టుగా పోస్ట్ చేసింది. అలియా భట్.ఈ ఘటనలో చనిపోయిన, గాయపడిన వారందరి కోసం నేను ఆ దేవుడ్ని ప్రార్థిస్తుంటాను మనమంతా కూడా కలిసి కట్టుగా ఈ టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడాలి అంటూ కియారా పోస్ట్ చేసింది.

Read Also: OTT: ఓటీటీలోకి వచ్చేసిన మ‌సూద మూవీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘తెలుసు కదా’వైఫల్యం పై రాశీ ఖన్నా ఏమన్నదంటే?

‘తెలుసు కదా’వైఫల్యం పై రాశీ ఖన్నా ఏమన్నదంటే?

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన నటి పూర్ణ

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన నటి పూర్ణ

త్వరలో పెళ్లి పీటలేక్కబోతున్న అనుష్క..?

త్వరలో పెళ్లి పీటలేక్కబోతున్న అనుష్క..?

మోసాలిసా పెళ్లి పై డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

మోసాలిసా పెళ్లి పై డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

4 ఏళ్ళకే వైవాహిక బంధానికి స్వస్తి పలికిన స్టార్ హీరోయిన్

4 ఏళ్ళకే వైవాహిక బంధానికి స్వస్తి పలికిన స్టార్ హీరోయిన్

బాలీవుడ్‌ను పలకరించిన సాయి పల్లవి.. జునైద్ ఖాన్ డెబ్యూ మూవీ
2:13

బాలీవుడ్‌ను పలకరించిన సాయి పల్లవి.. జునైద్ ఖాన్ డెబ్యూ మూవీ

అసభ్యకర ట్రోలింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య త్రిపాఠి

అసభ్యకర ట్రోలింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య త్రిపాఠి

నటుడు పార్థిబన్ వ్యాఖ్యలకు స్పందించిన త్రిష

నటుడు పార్థిబన్ వ్యాఖ్యలకు స్పందించిన త్రిష

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి
0:33

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి

మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ అవార్డు.. విజేతల పూర్తి జాబితా ఇదే!

మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ అవార్డు.. విజేతల పూర్తి జాబితా ఇదే!

విజయ్ పార్టీలోకి త్రిష?

విజయ్ పార్టీలోకి త్రిష?

పెద్ది’ సెట్స్ నుంచి అచ్చియమ్మ బర్త్‌డే గిఫ్ట్
0:33

పెద్ది’ సెట్స్ నుంచి అచ్చియమ్మ బర్త్‌డే గిఫ్ట్

📢 For Advertisement Booking: 98481 12870