టీమ్‌ఇండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar), మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్(Ajit Pawar) మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఆయన తన సంతాపాన్ని ప్రకటించారు.
Read Also: : మృత్యువు ముందుగానే హెచ్చరించిందా?
“అజిత్ పవార్ గారి అకాల మరణ వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమయ్యే ఒక నిబద్ధత కలిగిన నాయకుడిని మహారాష్ట్ర నేడు కోల్పోయింది. ఈ కష్టకాలంలో ఆయన కుటుంబ సభ్యులకు, అనుచరులకు దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఓం శాంతి” అంటూ సచిన్ తన సందేశాన్ని పంచుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: