గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరానికి చెందిన నరేంద్ర మోదీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో గురువారం మధ్యాహ్నం జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది.టేకాఫ్ అయన కాసేపటికే విమానం ప్రమాదానికి గురికాగా 274 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఈరోజే అధికారులు వెల్లడించగా ఇప్పటికీ ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓవైపు మృతదేహాలను గుర్తించేందుకు అధికారులు DNA పరీక్షలు చేస్తుండగా మరోవైపు శిథిలాల్లో ఇంకా ఎవరివైనా మృతదేహాలు ఉన్నాయేమో అని అధికారులు గాలిస్తున్నారు. ఈక్రమంలోనే ఈరోజు ఉదయం విమానంలోని తోక భాగంలో ఓ మృతదేహం లభ్యం అయింది.
ఉంటుందని
అయితే ఈ డెడ్ బాడీ విమాన సిబ్బందిలోని ఒకరిదే అయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.తాజాగా లభ్యమైన మృతదేహం ఎవరిదై ఉంటుందన్న దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతదేహం విమానం తోక భాగంలో గుర్తించడంతో ఆ విమానంలో విధులు నిర్వర్తించిన ఎయిర్‌హోస్టెస్(Air Hostess) దే అయి ఉంటుందని అనుకుంటున్నారు. కానీ ఇంకా అధికారికంగా దీన్ని గుర్తించలేకపోయారు. ముఖ్యంగా మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల డీఎన్ఏతో మృతదేహం సరిపోలిన తర్వాత అది ఎవరిదనేది తేలుతుందని చెప్పారు. ఇదిలా ఉండగా గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఈ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే విమానాశ్రయం సమీపంలోని వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నివాస ప్రాంతం వద్ద కుప్పకూలిన సంగతి తెలిసిందే.

సీనియర్ పైలట్
దీంతో దాదాపుగా విమానం మంటల్లో కాలిపోగా తోకభాగం మాత్రం భవనంపై చిక్కుకుపోయింది.మరోవైపు ప్రమాదానికి ముందు పైలట్ చివరి మాటలకు సంబంధించిన ఓ ఆడియో సందేశం బయటకు వచ్చింది.ఆ మెసేజ్ కేవలం 5 సెకన్లు మాత్రమే ఉంది. అందులో ఎయిరిండియా సీనియర్ పైలట్ కెప్టెన్ సుమిత్ సభ్రావల్ (Sumit Sabharwal), మేడే, మేడే, మేడే, నో పవర్, నో థ్రస్ట్ గోయింగ్ డౌన్ అని మెసేజ్ ఇచ్చారు. ఆ వెంటనే కనెక్షన్ తెగిపోవడం, విమానం కూలిపోవడం చకచకా జరిగిపోయాయి. ఈ ప్రమాదంపై కేంద్ర పౌరవిమానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శనివారం దిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
Read Also: Iran: అమెరికాతో అణు ఒప్పందం మాకు విశ్వాసం లేదన్న ఇరాన్