తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు,విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు,దివంగత నేత నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా,ప్రముఖ నటులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఆయనకు నివాళి అర్పించారు. ఈ ఉదయం వాళ్లు హైదరాబాద్ లో ఉన్న ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించారు. సమాధిపై పూలమాలలు ఉంచి నివాళి అర్పించారు. ఎన్టీఆర్ జయంతి(NTR’s birthday) సందర్భంగా ఘాట్ ను అలంకరించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇక్కడికి రానున్నందున బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనపు పోలీస్ సిబ్బందిని నియమించారు. వాహనాల రాకపోకలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకున్నారు. కాగా ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) ఆయనకు నివాళి అర్పించారు. సమాజానికి సేవ చేయడానికి, పేదలు, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడానికి ఆయన ఎనలేని కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు, తీసుకున్న నిర్ణయాలు ప్రశంసలు అందుకున్నాయని పేర్కొన్నారు.
చిరస్థాయి
నటుడిగా, నాయకుడిగా ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని, ఆయన నటించిన పాత్రలను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మోదీ ఆయనకు నివాళులర్పించారు. తెలుగు సినీ రంగంలో ఎన్టీఆర్ విశిష్ట నటుడని పేర్కొన్నారు.ఎన్టీఆర్(NTR) నుంచి ఎంతో ప్రేరణ పొందామని చెప్పారు.సినిమా మాధ్యమంగా ఎన్టీఆర్.. యావత్ సమాజాన్ని చైతన్యవంతులు చేశారని మోదీ చెప్పారు. ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే సమాజంలో స్ఫూర్తినింపే సినిమాలు తీశారని అన్నారు.
ఆశయాలను
ఎన్టీఆర్ ఆశయాల సాధనకు ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని మోదీ తెలిపారు.తన స్నేహితుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి(Chandrababu Naidu)నేతృత్వంలో ఏపీలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి(NDA coalition alliance) ప్రభుత్వం, ఎన్టీఆర్ ఆశయాలను సాధించడానికి, ఆయన దార్శనికతలో ప్రయాణించడానికి నిరంతరాయంగా కృషి చేస్తోందని ప్రధాని మోదీ చెప్పారు.
Read Also: Chandrababu Naidu: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఘన నివాళి