మంగళగిరి నియోజకవర్గంలో ప్రజల ఎన్నో సంవత్సరాల కలగా నిలిచిన ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చివరకు ఆరంభమైంది. చినకాకాని వద్ద 100 పడకల సామర్థ్యం కలిగిన ఈ ప్రభుత్వ ఆసుపత్రి భవనానికి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టూరిజం, కల్చరల్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ కూడా పాల్గొన్నారు.

ఎన్టీఆర్ వేసిన బాటలో లోకేశ్
నారా లోకేశ్ ఈ కార్యక్రమానికి సంబంధించిన తన భావోద్వేగాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం, 1984లో స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) మంగళగిరిలో వైవీసీ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదే స్థలంలో ఏర్పాటు చేయబోయే కొత్త ఆసుపత్రి నిర్మాణానికి లోకేశ్ శంకుస్థాపన చేయడం చారిత్రక నేపథ్యాన్ని కలిగి ఉంది. మంగళగిరి ప్రజల మూడుదశాబ్దాల కల వంద పడకల ఆసుపత్రి. ఏడాదిలోగా ఆ కలను నెరవేర్చుతానని చెప్పాను. ఇప్పుడు మాట నిలుపుకుంటున్నాను. – నారా లోకేశ్ ఈ ఆసుపత్రి పూర్తి కాగానే మంగళగిరి పరిసర ప్రాంతాలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. ఇప్పటికే మంగళగిరిలో ప్రభుత్వ వైద్య సేవల కొరతపై తరచూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో లోకేశ్ శంకుస్థాపన కార్యక్రమం స్థానికులకు కొత్త ఆశల జ్యోతి అంటించిందని చెప్పొచ్చు. నారా లోకేశ్ తన ట్వీట్‌లో 1984లో ఎన్టీఆర్ పెట్టిన శిలాఫలకాన్ని చూపిస్తూ తీసుకున్న సెల్ఫీని షేర్ చేయడం భావోద్వేగానికి గురిచేసింది. ఈ క్రమంలో ప్రజల్లో ‘తండ్రి వారసుడిగా ఎన్టీఆర్ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే నాయకుడిగా లోకేశ్ ఎదుగుతున్నాడు’ అనే చర్చ మొదలైంది. మంగళగిరి పట్టణంలో 40 ఏళ్ల క్రితం 30 పడకల ఆసుపత్రికి అన్న ఎన్టీఆర్ గారు శంకుస్థాపన చేశారు. 40 ఏళ్ల తర్వాత 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి నేను శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉంది అని పేర్కొన్నారు.
Read also: TTD: చెప్పులతో శ్రీవారి ఆలయంలోకి..టీటీడీ సిబ్బందిపై వేటు