TTD: చెప్పులతో శ్రీవారి ఆలయంలోకి..టీటీడీ సిబ్బందిపై వేటు

TTD: చెప్పులతో శ్రీవారి ఆలయంలోకి..టీటీడీ సిబ్బందిపై వేటు

తిరుమలలో మరోసారి భద్రతా విఫలమైందని తెలిపే ఘోర ఘటన చోటు చేసుకుంది. భక్తులు చెప్పులతోనే శ్రీవారి ఆలయ మహాద్వారం వరకు చేరుకోవడం, ఆలయంలోకి అడుగు పెట్టే స్థితికి చేరుకోవడం టీటీడీ భద్రతాపరంగా ఎంతగా వెనుకబడ్డదనే దానికి నిదర్శనం. ఈ ఘటనపై టీటీడీ వెంటనే స్పందించినా, ఇప్పటికే జరిగిన నిర్లక్ష్యం ఎంతో పెద్దవిషయమని పలువురు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisements

వివరాల్లోకి వెళ్తే

ముగ్గురు భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, ఫుట్‌పాత్‌ హాల్‌, డౌన్‌ స్కానింగ్ పాయింట్లు ఇలా అన్ని భద్రతా సరిహద్దులను దాటి, చెప్పులతోనే ఏకంగా శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు వచ్చేశారు. ఆలయంలోకి అడుగు పెట్టేందుకు కేవలం కొన్ని అడుగుల దూరంలో ఉన్న సమయంలో టీటీడీ సిబ్బంది వారిని గుర్తించారు. వారు చెప్పులు వేసుకున్నది గమనించిన సిబ్బంది వెంటనే వారిని నిలిపివేశారు. ఆలయంలోకి చెప్పులతో వెళ్లే నిబంధన లేదని, చెప్పులు తీసేసి వెళ్లాలని సూచించడంతో ముగ్గురూ చెప్పులను అక్కడే వదిలేసి ఆలయంలోకి వెళ్లిపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఎంతో పవిత్రంగా భావించే తిరుమల ఆలయంలో, ఇటువంటి నిర్లక్ష్యంతో భక్తులు చెప్పులతోనే మహాద్వారం వరకూ చేరడం సర్వత్రా ఆశ్చర్యం కలిగిస్తోంది. టీటీడీ విధినిర్వహణపై ప్రజలలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భద్రత సిబ్బంది వీరిని గుర్తించకపోవడం వల్లే వారు పాదరక్షలతో ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించారు. వాళ్లు ఏ మాత్రం పట్టించుకోకపోవడం వల్ల ఈ దుస్థితి తలెత్తింది.

టీటీడీ చర్యలు – ఏడుగురు సస్పెండ్, మరి ఆరుగురిపై ప్రతిపాదన

ఈ ఘటనను టీటీడీ తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. సిబ్బందిపై చర్యల తీసుకుంది. ఏడుమందిని సస్పెండ్ చేసింది. మరో ఆరుమందిని సస్పెండ్ చేయాలంటూ ప్రతిపాదించింది. ఆయా ఉద్యోగుల పేర్లు, పూర్తి వివరాలతో కూడిన ఓ ప్రకటనను టీటీడీ విడుదల చేసింది. తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించడంలో విఫలం కావడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన వివరించింది. ఫుట్‌పాత్ హాల్, డౌన్ స్కానింగ్ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్న టీటీడీ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు సస్పెండ్ అయ్యారు. అలాగే తమ విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందిని సస్పెండ్ చేయాలని కోరుతూ ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్‌కు ప్రతిపాదన పంపారు. సస్పెండ్ అయిన వారిలో చక్రపాణి- సీనియర్ అసిస్టెంట్, వాసు- జూనియర్ అసిస్టెంట్, టీటీడీ భద్రతా సిబ్బంది- డీ బాలకృష్ణ (పీఎస్జీ 0807), వసుమతి (సీడబ్ల్యూపీఎస్జీ 514067), టీ రాజేష్ కుమార్ (ఏడబ్ల్యూపీఓ 512475), కే వెంకటేష్ (పీఎస్జీ 932), ఎం బాబు (ఏడబ్ల్యూపీఓ) ఉన్నారు. సస్పెన్షన్‌కు సిఫారసు చేసిన ఎస్పీఎఫ్ సిబ్బంది- సీ రమణయ్య (ఇన్‌ఛార్జ్ ఏఎస్ఐ 1101), బీ నీలబాబు (సీటీ 3595), డీఎస్‌కే ప్రసన్న (సీటీ 3602), సత్యనారాయణ (ఏఎస్ఐ 696), పోలి నాయుడు (సీటీ 3516), ఎస్ శ్రీకాంత్ ఉన్నారు. తిరుమలలో జరుగుతున్న ఈవిధమైన సంఘటనలు భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయవచ్చు. టీటీడీ పాలకమండలి, అధికారులు మరింతగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

Read also: Subramanya Swami: టీటీడీ గోశాలలో ఆవుల మృతిపై స్పందించిన సుబ్రహ్మణ్యస్వామి

Related Posts
Israel-Hamas : గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు.. 59 మంది మృతి!
Israeli attacks on Gaza.. 59 people killed!

Israel-Hamas : ఇజ్రాయెల్‌- హమాస్‌ ల మధ్య మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తాజాగా గాజా పై టెల్‌అవీవ్‌ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇందులో 50 మందికి పైగా Read more

Sunita Williams: ఉత్కంఠకు తెర భూమి మీదకు రానున్న సునీత విలియమ్స్
Sunita Williams: ఉత్కంఠకు తెర భూమి మీదకు రానున్న సునీత విలియమ్స్

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) లో తొమ్మిది నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ మరియు ఆమె సహచరుడు బచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమికి Read more

బెటాలియన్‌ కానిస్టేబుళ్లపై వేసిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలి – హరీష్ రావు డిమాండ్
Harish Rao stakes in Anand

బెటాలియన్‌ కానిస్టేబుళ్లపై వేసిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు కోరారు. టాలియన్ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ విధించడం, ఆకస్మికంగా నిబంధనలు సవరించడం వారికి అన్యాయం చేస్తుందని Read more

వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కాల్సిందే – బీజేపీ నేత
BJP leader Subramanian Swam

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్ష హోదా చర్చనీయాంశమవుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) కు అసెంబ్లీలో తక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, అధికార పార్టీ తదితర ప్రతిపక్ష పార్టీలతో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×