సినిమా రివ్యూలపై ఇండస్ట్రీలో ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. సమీక్షలు పాజిటివ్ గా ఉంటే ఇబ్బందేమీ లేదు కానీ, ఒకవేళ నెగెటివ్ గా ఉంటే మాత్రం డిస్కషన్స్ మొదలవుతాయి. ఇప్పుడు టాలీవుడ్ లో అలాంటి చర్చే జరుగుతోంది. రిలీజైన రోజున ఇచ్చే వీడియో రివ్యూల ప్రభావం సినిమా ఓపెనింగ్స్ పై పడుతోందని సినీ పెద్దలు భావిస్తున్నారు. విడుదల రోజు సమీక్షలు ఇవ్వకుండా ఆపాలనే ప్రయ్నత్నాలు, సమాలోచనలు సాగుతున్నాయని తెలుస్తోంది.ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుందంటే.. మొదటి ఆట పడగానే మీడియాలో, సోషల్ మీడియాలో రివ్యూలు రావడం మనం చూస్తున్నాం. అయితే ఇకపై సినిమా విడుదలైన రోజున ఇచ్చే వీడియో రివ్యూలను అడ్డుకోవాలని యోచిస్తున్నారు. ఫస్ట్ డే రివ్యూలు ఇవ్వకుండా, థియేటర్లలోకి వచ్చిన 2 రోజులు తర్వాత సమీక్షించాలే నిర్ణయంపై ఫిలిం ఛాంబర్లో చర్చ జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. దానికి అంగీకరించకపోతే తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అన్ని విధాలా నిషేధాలు విధించాలనే నిర్ణయం తీసుకోవాలని గిల్డ్ సభ్యులపై కొందరు పెద్దలు ఒత్తిడి చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
రివ్యూ
సోషల్ మీడియా లేని రోజుల్లోనే సినిమాలకు సమీక్షలు ఇవ్వడం మొదలైంది. ఒకప్పుడు సినిమా రిలీజైన తర్వాత వార్తా పత్రికల్లో, మంత్లీ మ్యాగజైన్స్ లో రివ్యూలు రాసేవారు. రాను రాను విడుదలైన మరుసటి రోజు న్యూస్ పేపర్స్ లో రివ్యూలు రాయడం ప్రారంభించారు. ఇబ్బడిముబ్బడిగా టీవీ ఛానల్స్ వచ్చిన తర్వాత, రివ్యూలకు వీడియో రూపం వచ్చింది. మొదట్లో సినిమా విడుదలైన రోజు రాత్రి ప్లస్సులు, మైనస్సుల గురించి చెప్పేవారు. కానీ ఇప్పుడు డిజిటల్ యుగంలో సినిమా థియేటర్లలోకి వచ్చిన వెంటనే సమీక్షలు ఇచ్చేస్తున్నారు. అయితే ఇక్కడ సద్విమర్శతో సమస్యేమీ లేదు కానీ పనిగట్టుకొని వాంటెడ్ గా నెగెటివిటీని ప్రచారం చేస్తున్న రివ్యూలపైనే అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

నాని మాట్లాడుతూ
నాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం హిట్ 3. బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ హిట్ నుంచి వస్తున్న 3వ చిత్రమిది. ఈ చిత్రంలో నాని కథానాయకుడిగా నటించడంతో పాటు నిర్మాణ బాధ్యతలు చేపట్టాడు. శైలేశ్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుండగా మే 01న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే మేకర్స్ ప్రమోషన్స్‌లో షురూ చేశారు. ఇందులో భాగంగానే వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గోంటున్నాడు నాని. తాజాగా ఒక ఇంటర్వ్యూలో నానిని సినిమా విడుదల కాగానే రివ్యూలు ఎందుకు అని ఈ మధ్య అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి అని అడుగగా నాని మాట్లాడుతూ సినిమాలకు రివ్యూలు ఇచ్చేవారు ఒకరోజు ఆగమని చిత్రయూనిట్‌లు చెబుతున్నాయి. వాళ్లు ఎందుకు ఆగుతారు. దీనిని ఒక్కరోజు లాగవచ్చు లేదా రెండు రోజులు లాగవచ్చు కానీ చెప్పాల్సింది మాత్రం ఆపరు. ఇంతకుముందు అంటే సోషల్ మీడియా లాంటివి లేవు. కానీ ఇప్పుడు ఏం చేసినా తెలుస్తుంది.అని చెప్పారు.
Read Also: Jr Ntr: ప్రశాంత్ నీల్ సినిమా కోసం భారీగా బరువు తగ్గిన ఎన్టీఆర్