हिन्दी | Epaper

Ustaad Bhagat Singh Ticket Rates: ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ ధరల పెంపు

Aanusha
Ustaad Bhagat Singh Ticket Rates: ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ ధరల పెంపు

Ustaad Bhagat Singh Ticket Rates: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఉగాది కానుకగా ఈ నెల 19న (మార్చి 19, 2026) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్ర యూనిట్‌కు, అభిమానులకు తీపి కబురు అందించింది. టికెట్ ధరల పెంపుతో పాటు ప్రత్యేక షోలకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also: RC17: రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్.. RC17 నుంచి కీలక అప్‌డేట్

పది రోజుల పాటు టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. జీఎస్టీతో కలిపి సింగిల్‌ స్క్రీన్‌లలో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 చొప్పున రేట్లు పెంచుకోడానికి అవకాశమిచ్చింది. మార్చి 19వ తేదీ నుంచి మార్చి 28 వరకూ ఈ రేట్లు అమల్లో ఉంటాయని తెలిపారు. అలానే రోజుకు ఐదు షోలు ప్రదర్శించడానికి పర్మిషన్ ఇచ్చారు.

Ustaad Bhagat Singh ticket prices hiked
Ustaad Bhagat Singh ticket prices hiked

బెనిఫిట్ షోలు టైమింగ్స్

మార్చి 19న తెల్లవారుజామున 4 – 5గంటల మధ్యలో బెనిఫిట్‌ షో వేసుకోడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీని టికెట్‌ ధరను జీఎస్టీతో కలిపి రూ.500గా నిర్ణయించింది. మాములుగా స్టార్ హీరోల సినిమాలకు ముందు రోజు రాత్రి పెయిడ్ ప్రీమియర్ షోలు వేస్తున్నారు. అయితే మార్చి 18న ‘ధురంధర్ 2’ సినిమా ప్రివ్యూలు వేస్తున్నారు. అందుకే ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమాకి ప్రీమియర్ షోలకి బదులుగా, రిలీజ్ రోజు వేకువజామున బెనిఫిట్ షోలు ప్రదర్శించాలని నిర్ణయించుకున్నారని టాక్ వినిపిస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870