Nara Lokesh On Mega DSC :  మెగా డీఎస్సీ వివాదం – సభలో లోకేశ్ సవాల్

Follow Us: Google News Daily Hunt
Nara Lokesh On Mega DSC
Nara Lokesh On Mega DSC
FONT SIZE
GET APP

Nara Lokesh On Mega DSC : శాసనసభ వర్షాకాల సమావేశాలలో భాగంగా మెగా డీఎస్సీ-2025 నిర్వహణపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఎంతో బాధ్యతాయుతంగా కేవలం 148 రోజుల్లోనే మొత్తం డీఎస్సీ నియామక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశామని సభకు వెల్లడించారు. కూటమి ప్రభుత్వ హయాంలో విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి వైఎస్సార్సీపీ నేతలు అడ్డుపడేందుకు యత్నించారని, ఏకంగా 141 వరకు కోర్టు కేసులు వేశారని మంత్రి మండిపడ్డారు. దేశంలోనే తొలిసారిగా వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ విధానాలను అత్యంత పారదర్శకంగా అమలు చేస్తూ అభ్యర్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా నియామక ప్రక్రియను ముగించామని స్పష్టం చేశారు.

Read Also: Botsa VS Atchannaidu : మంత్రి అచ్చెన్నాయుడి పై బొత్స ఆగ్రహం

Nara Lokesh On Mega DSC
Nara Lokesh On Mega DSC

Nara Lokesh On Mega DSC : ఉపాధ్యాయుల శిక్షణపై గత ప్రభుత్వంతో పోలిక

కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు వారిని సింగపూర్, ఫిన్లాండ్ వంటి అంతర్జాతీయ దేశాలకు శిక్షణ కోసం పంపుతోందని లోకేశ్ తెలిపారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రం ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద కాపలా ఉంచి వారి గౌరవాన్ని దిగజార్చిందని విమర్శించారు. డీఎస్సీ ప్రక్రియపై వైఎస్సార్సీపీ నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని లోకేశ్ సవాల్ విసిరారు. ఎక్కడైనా, ఏ వేదికపైనైనా డీఎస్సీ పారదర్శకతపై చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు