Choutuppal Murder Case : యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌లో సంచలనం సృష్టించిన శివసత్తు సుధాకర్ స్వామి హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తొలుత బంగారం, వెండి, నగదు దోపిడీ కోసం జరిగిన హత్యగా భావించిన ఈ ఘటనలో తాజాగా వ్యక్తిగత వేధింపుల కోణం బయటపడింది. సుధాకర్ స్వామి తనను తరచూ లైంగికంగా వేధిస్తున్నాడని, ఆ వేధింపులు భరించలేకే హత్యకు పథకం రచించినట్లు ప్రధాన నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం. ఈ కేసులో మధ్యప్రదేశ్‌కు చెందిన పవన్ కుమార్ (21), అతడి స్నేహితుడు హర్ష్ సంతోష్ పాండే పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సుధాకర్ స్వామి వద్ద ఉన్న భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు, వెండి, నగదు కూడా నిందితులను హత్యకు ప్రేరేపించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ వివరాలను జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ వెల్లడించారు.
Read Also: RTC Conductor Pravalika: కండక్టర్ ప్రవళిక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి.. కళ్లు దానం

పూజలు, కొలుపులతో జీవనం.. భారీగా ఆర్జించిన సుధాకర్ స్వామి
రాళ్లబండి సుధాకర్ స్వామి చౌటుప్పల్‌లో నివాసం ఉంటూ శివసత్తుగా జీవనం సాగించేవారు. దేవుడి పండుగలు, కొలుపులు నిర్వహించడం, వ్యక్తిగత పూజలు చేయడం ఆయన వృత్తిగా ఉండేది. ఒక్కో పూజకు రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల వరకు తీసుకునేవారని సమాచారం. సుధాకర్ స్వామికి వివాహం కాలేదు. అయితే ఓ కుమారుడిని దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం ఆ కుమారుడు హైదరాబాద్‌లో బీటెక్ చదువుతున్నాడు. సుధాకర్ స్వామికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను ఆయన మేనల్లుడు సురేశ్ చూసుకునేవాడు. ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం సుధాకర్ స్వామి తరచూ ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు. ఈ క్రమంలోనే అస్సాంలోని కామాఖ్య అమ్మవారి ఆలయానికి వెళ్లిన సమయంలో మధ్యప్రదేశ్‌కు చెందిన పవన్ కుమార్‌తో పరిచయం ఏర్పడింది. సుమారు రెండేళ్ల క్రితం అస్సాంలోని కామాఖ్య ఆలయానికి వెళ్లిన సమయంలో సోలంగ్ గ్రామానికి చెందిన పవన్ కుమార్ (21)తో సుధాకర్ స్వామికి పరిచయం ఏర్పడింది. కొంతకాలానికి వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే ఈ పరిచయం తర్వాత వివాదానికి దారితీసినట్లు తెలుస్తోంది. సుధాకర్ స్వామి తనతో సన్నిహితంగా ఉన్న సమయంలో కొన్ని దృశ్యాలను మొబైల్ ఫోన్‌లో రికార్డు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ వీడియోనే తర్వాత పవన్‌ను బెదిరించేందుకు ఉపయోగించినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది.
Choutuppal Murder Case : వీడియోతో బ్లాక్‌మెయిల్.. వేధింపులు భరించలేక హత్యకు నిర్ణయం
రెండు నెలల క్రితం ఇద్దరూ కలిసిన సమయంలో రికార్డు చేసిన వీడియోను బయటపెడతానంటూ సుధాకర్ స్వామి తనను బెదిరించేవాడని పవన్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. తరచూ తనను కలవాలని ఒత్తిడి చేయడంతో పాటు, అందుకు నిరాకరిస్తే వీడియోను ఇతరులకు చూపిస్తానని హెచ్చరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిణామాలతో పవన్ తీవ్ర ఒత్తిడికి గురైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ వేధింపుల నుంచి బయటపడటంతో పాటు సుధాకర్ స్వామి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను దోచుకోవాలనే ఉద్దేశంతో హత్యకు పథకం వేసినట్లు విచారణలో తేలింది. వ్యక్తిగత కక్షతో పాటు ఆర్థిక ప్రయోజనం కూడా ఈ నేరానికి కారణమైనట్లు పోలీసులు భావిస్తున్నారు. సుధాకర్ స్వామి మేనల్లుడు సురేశ్‌కు గత నెలలో వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు సుధాకర్ స్వామి భారీగా బంగారు ఆభరణాలు ధరించి హాజరయ్యారు. ఆయన ఒంటిపై కిలోకు పైగా బంగారం ఉండటాన్ని పవన్ గమనించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో సుధాకర్ స్వామిని హత్య చేస్తే తనపై జరుగుతున్న వేధింపులు ఆగిపోవడంతో పాటు, ఆయన వద్ద ఉన్న బంగారం కూడా దక్కుతుందని పవన్ భావించినట్లు విచారణలో వెల్లడైంది. ఈ ఆలోచనతో తన స్నేహితుడు హర్ష్ సంతోష్ పాండే సహాయం కోరాడు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :