CSK New Head Coach: చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తదుపరి హెడ్ కోచ్ ఎవరనే అంశంపై భారత క్రికెట్ దిగ్గజాల మధ్య ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ను సీఎస్‌కే కొత్త హెడ్ కోచ్‌గా నియమిస్తే బాగుంటుందని టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడగా, భారత మాజీ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఆ ప్రతిపాదనను తీవ్రంగా ఖండించారు.
Read Also : BWF World Championships: నేటి నుంచి బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ పోటీలు

CSK New Head Coach: మోర్గాన్, మెక్‌కలమ్ వద్దు.. మైఖేల్ హస్సీయే కరెక్ట్.. శ్రీకాంత్
అశ్విన్ వ్యాఖ్యలపై స్పందించిన కృష్ణమాచారి శ్రీకాంత్.. ఇయాన్ మోర్గాన్ లేదా బ్రెండన్ మెక్‌కలమ్ వంటి వారిని సీఎస్‌కే కోచ్‌లుగా అంగీకరించేదే లేదని స్పష్టం చేశారు.
- మైఖేల్ హస్సీకి మద్దతు: సీఎస్‌కే సంస్కృతి, వాతావరణం బాగా తెలిసిన మైఖేల్ హస్సీనే హెడ్ కోచ్ పదవికి సరైన ఎంపిక అని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు.
- ధోనీ పాత్రపై స్పష్టత ముఖ్యం: కొత్త కోచ్ నియామకం గురించి ఆలోచించే కంటే ముందు, జట్టులో ఎంఎస్ ధోనీ భవిష్యత్తు, ఆయన పాత్రపై యాజమాన్యం స్పష్టత తీసుకురావడమే అత్యంత కీలకమని శ్రీకాంత్ వ్యాఖ్యానించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :