(Collector Rahul Raj) రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అరైవ్ అలైవ్ అనే కార్యక్రమాన్ని మెదక్ పట్టణంలోని(Medak) ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, పొద్దున పిఎస్పీ మహేందర్, ఆర్టీవో వెంకటస్వామి, ఇ ఇ వేణు, డీఎస్పీ ప్రసన్న కుమారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ట్రాఫిక్ నియమాల అవగాహన ద్వారా ప్రమాదాలను నివారించవచ్చన్నారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపరదన్నారు.
ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. దేశం అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో 4వ స్థానంలో ఉన్నప్పటికీ, రోడ్డు ప్రమాదాల్లో మొదటి స్థానంలో ఉండటం ఆందోళనకారం అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఎన్నో సంవత్సరాలుగా వారోత్సవాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రమాదాలు తగ్గడం లేదని పేర్కొన్నారు. అందుకే నెల రోజుల పాటు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Read Also: Medaram: గద్దెల వద్ద కొబ్బరికాయలు విసరడంతో భక్తులకు గాయాలు
మీ ద్వారా తల్లిదండ్రులకు కూడా రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలని విద్యార్థులను సూచించారు. (Collector Rahul Raj) జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ నడిచేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. మోటారు సైకిళ్ల ద్వారానే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకొని మన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని తెలిపారు.

సక్రమంగా వెళ్లకపోవడం, అశ్రద్ధ, సెల్‌ఫోన్ మాట్లాడుతూ నడవడం లేదా వాహనం నడపడం, జిగ్‌జాగ్‌గా వెళ్లడం, అతివేగం వంటి కారణాల వల్ల వాహనం నడిపే సమయంలో ధ్యాస లేక ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చునే వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని స్పష్టం చేశారు. అనంతరం విద్యార్థులచే రోడ్డు భద్రతా నియమాలపై ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మీడియా ప్రతినిధులు,విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: