టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అభిమానులకు షాకిచ్చాడు. టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బాటలోనే నడిచాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సోమవారం భావోద్వేగభరితమైన పోస్ట్‌తో తన నిర్ణయాన్ని వెల్లడించాడు. కొద్దిరోజుల క్రితమే రోహిత్ శర్మ సైతం టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. రోహిత్ నిర్ణయం వెలువడిన వెంటనే కోహ్లీ కూడా తప్పుకుంటాడని వార్తలు వచ్చాయి. అదే సమయంలో టెస్ట్ క్రికెట్‌లో కొసాగాలని కోహ్లీని బీసీసీఐ(BCCI) బుజ్జిగిస్తుందని కూడా ప్రచారం జరిగింది. కానీ కోహ్లీ మాత్రం ఎవరి మాట వినకుండా ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు.టెస్ట్ క్రికెట్ తనను ఎంతో పరీక్షించిందని, ఎన్నో గుణపాఠాలు నేర్పిందని, ఎంతో ఇచ్చిందని,గుండె నిండా సంతోషంతో ఈ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నానని కోహ్లీ తన ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ నిర్ణయంతో షాక్‌కు గురైన అభిమానులు బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంపై క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) స్పందించాడు. కోహ్లీ ఓ అద్భుతమైన ఆటగాడని కొనియాడని సచిన్ తన ఆటతో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాడని చెప్పాడు. భవిష్యత్తులో విరాట్ కోహ్లీ మరింత సక్సెస్ సాధించాలని ఆకాంక్షించాడు.

యువ క్రికెటర్ల
కోహ్లీ రిటైర్మెంట్‌పై ఎక్స్‌వేదికగా స్పందించిన సచిన్ ఓ సంఘటనను గుర్తు చేసుకున్నాడు. తన చివరి టెస్ట్ మ్యాచ్ రోజు కోహ్లీ చేసిన పని ఎప్పటికీ మరిచిపోలేనని తెలిపాడు. కోహ్లీ నువ్వు టెస్ట్ క్రికెట్(Test cricket)కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో నాకు ఓ అద్భుతమైన ఘటన గుర్తుకొచ్చింది. 12 ఏళ్ల క్రితం నా చివరి టెస్ట్ మ్యాచ్ సందర్భంగా నువ్వు మీ దివంగత తండ్రి ఇచ్చిన ఓ దారాన్ని నాకు బహుమతిగా ఇచ్చేందుకు ప్రయత్నించావు. అది నీ వ్యక్తిగతమైనది కావడంతో నేను స్వీకరిచలేకపోయాను. అయితే ఆ చర్య నా హృదయాన్ని హత్తుకుంది. నా మనసులో చిరస్థాయిగా ఉండిపోయింది.అలాంటి దారాన్ని నేను ఇవ్వలేను. దయచేసి నా అభిమానాన్ని, అభినందనలను స్వీకరించండి. నీ ఆటతో ఎంతో యువ క్రికెటర్లకు స్ఫూర్తినిచ్చావు.నీ అద్భుతమైన కెరీర్(A wonderful career)కు అభినందనలు.’అని సచిన్ ట్వీట్ చేశాడు.విరాట్ కోహ్లీ తన 14 ఏళ్ల టెస్ట్ కెరీర్‌లో 123 టెస్ట్‌లు ఆడి 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి. సుదీర్ఘ ఫార్మాట్‌లో కోహ్లీ సక్సెస్‌ఫుల్ టీమిండియా కెప్టెన్. అతని సారథ్యంలో 68 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 40 మ్యాచ్‌లు గెలిచింది. 2016-19 మధ్య కాలంలో కోహ్లీ పరుగుల మోత మోగించాడు. ఈ మూడేళ్లలో అతను 43 టెస్ట్‌ల్లో 66.79 సగటుతో 4,208 రన్స్ చేశాడు. ఆడిన 69 ఇన్నింగ్స్‌లో 16 శతకాలతో పాటు 10 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఈ కాలంలోనే కోహ్లీ వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగాడు.