हिन्दी | Epaper

Andhra Pradesh: ఏపీలో ఉచిత సిలిండర్ల పథకంలో కీలక మార్పులు

Anusha
Andhra Pradesh: ఏపీలో ఉచిత సిలిండర్ల పథకంలో కీలక మార్పులు

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు దిశగా కూటమి నేతలు కసరత్తు వేగవంతం చేసారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న వేళ పథకాల అమలుకు ఇక ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. సూపర్ సిక్స్ పథకాల్లో(Super Six schemes) కీలకమైన తల్లికి వందనం జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం అయ్యేలోగానే అమలు చేయాలని నిర్ణయించారు. కేంద్రం ఈ సారి అమలు చేసే పీఎం కిసాన్ పథకంతో పాటుగా తొలి విడత అన్నదాత సుఖీభవ నిధులు రైతు ల ఖాతాల్లో జమ చేయాలని భావిస్తున్నారు. మహిళల కోసం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీపం 2 పథకం(Deepam 2 scheme)కింద అర్హత కలిగిన కుటుంబాలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. 2024 అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించారు. సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా మహిళలపై ఆర్థిక భారాన్ని తగ్గించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం తెచ్చింది.ఇక ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కింద తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు నాలుగు నెలలకు ఒకటి చొప్పున ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను అందిస్తోంది. మొదటి సిలిండర్ అక్టోబర్ 31 నుంచి మార్చి 31 వరకు. రెండో సిలిండర్ ఏప్రిల్ 1 నుంచి జులై 31 వరకు మూడో ఉచిత గ్యాస్ సిలిండర్ జులై 1 నుంచి నవంబర్ 30 వరకు అందిస్తున్నారు.

 Andhra Pradesh: ఏపీలో  ఉచిత సిలిండర్ల పథకంలో కీలక మార్పులు
ఏపీలో ఉచిత సిలిండర్ల పథకంలో కీలక మార్పులు

ప్రభుత్వం

లబ్ధిదారులు సాధారణ విధానంలో గ్యాస్ సిలిండర్ బుక్ చేసి, మొదట డబ్బులు చెల్లించాలి. ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లోగా గ్యాస్ సబ్సిడీ మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం(AP Government) లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తూ వస్తోంది. పట్టణాల్లో 24 గంటల్లో, పల్లెల్లో 48 గంటల్లో గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తున్నారు. అయితే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం నగదు చెల్లింపుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేరే ఆలోచన చేస్తోంది.తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం(Free gas cylinder scheme లబ్ధిదారుల ఖాతాల్లో సిలిండర్ బుకింగ్ కంటే ముందే నగదు చెల్లించాలని నిర్ణయించినట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఏడాదిలో ఉచితంగా అందించే 3 సిలిండర్ల నగదును ఒకేసారి చెల్లించాలని నిర్ణయించినట్లు చెప్పారు. లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ ఎప్పుడు బుక్ చేసుకున్నా, సిలిండర్‌ తీసుకోకపోయినా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల నగదును ఒకేసారి వారి బ్యాంకు ఖాతాలో వేయాలని నిర్ణయించుకున్నట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు.ఏపీలో ఉచిత సిలెండర్ల పథకం అమలుకు ఏటా రూ.2684.75 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఏడాదిలో అర్హత కలిగిన లబ్దిదారుకి మూడు సిలిండర్ల ఉచితంగా ఇస్తున్నారు. ఇప్పటి వరకు తొలుత సిలిండర్ తీసుకునే సమయంలో లబ్ది దారులు నగదు చెల్లించాల్సి వస్తోంది. ఆ తరువాత వారి ఖాతాల్లో ఆ మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తోంది. కొత్త విధానం అమల్లోకి వస్తే ముందుగానే లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ కానుంది.

Read Also : Andhra Pradesh: ఏపీలో సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

📢 For Advertisement Booking: 98481 12870