ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుమార్తె హర్షిత ప్రేమ వివాహం చేసుకున్నారు. తన ప్రియుడు సంభవ్ జైన్ ను హర్షిత పెళ్లాడారు. ఢిల్లీలోని కపూర్తలా హౌస్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరి వివాహం జరిగిన ప్రదేశం మహారాజా ఆఫ్ కపూర్తలా ఉన్న నివాసంగా గుర్తింపు పొందింది. కూతురు వివాహ వేడుకల్లో కేజ్రీవాల్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. సతీమణి సునీతతో కలిసి హుషారుగా డ్యాన్స్ చేశారు.’పుష్ప 2′ సినిమాలోని ‘సూసేకి’ హిందీ వెర్షన్ పాటకు ఆయన స్టేప్పులేస్తూ ఈవెంట్లో సందడి చేశారు. వీళ్లతోపాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ప్రముఖులు
కూతురు వివాహాన్ని కేజ్రీవాల్ దగ్గరుండి తన చేతుల మీదుగా జరిపించారు. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు.పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్‌తో సహా పార్టీ నాయకులు, పలువురు రాజకీయ ప్రముఖులు పెళ్లికి హాజరయ్యారు. ఎప్పుడు సింపుల్‌గా ఉంటే కేజ్రీవాల్ కూతురు పెళ్లిలో షేర్వాణీ ధరించి గ్రాండ్ లుక్‌లో కనిపిస్తున్నారు. హర్షిత, సంభవ్ జైన్ ఇద్దరూ ఐఐటీ ఢిల్లీలో చదువుతున్న సమయంలో పరిచయం అయ్యారు. ఈ క్రమంలో వారి స్నేహం ప్రేమగా మారింది. వీరిద్దరూ ఇటీవలే ఒక స్టార్టప్ ను కూడా ప్రారంభించారు.
అసోసియేట్
సంభవ్ జైన్ ఐఐటీ ఢిల్లీలో గ్రాడ్యుయేట్ పూర్తయ్యింది. అదే విద్యాసంస్థలో హర్షిత కూడా కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. చదువుకునే సమయంలో వీరిద్దరి పరిచయం ఏర్పడి అది కాస్తా స్నేహంగా, ఆపై ప్రేమగా మారింది.చదువు పూర్తయిన తర్వాత వీరిద్దరూ ఉద్యోగాలు కూడా చేశారు.హర్షిత కేజ్రీవాల్ గురుగ్రామ్‌లోని ఓ కంపెనీలో అసోసియేట్ కన్సల్టెంట్‌గా, సంభవ్ జైన్ ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇలా చాలా రోజులు ప్రేమాయణం సాగించిన ఈ జంట పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అలా ఇరుకుటుంబాల పెద్దలకు చెప్పగా వారు కూడా ఒప్పుకున్నారు.
Read Also: Hero Ajith Kumar : మరోసారి తమిళ స్టార్ హీరో అజిత్ కారుకు ప్రమాదం