బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ బ్రాండ్ ఇప్పుడు అంతగా కనిపించడం లేదు. ఒకప్పుడు దర్శక, నిర్మాతగా కరణ్ జోహార్‌కు ఉన్న ఇమేజ్ వేరు. ధర్మ ప్రొడక్షన్స్ అంటే ఒకప్పుడు అందరికీ గౌరవం ఉండేది. గత కొన్నేళ్ల నుంచి కరణ్ జోహార్ మీద, ధర్మ ప్రొడక్షన్స్ మీద నార్త్ ఆడియెన్స్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక కరణ్ జోహార్ తీస్తున్న చిత్రాలు ఇప్పుడు అంతా వర్కౌట్ అవ్వడం లేదు. పైగా నెపో కిడ్స్, స్టార్ వారసుల్ని ఇంట్రడ్యూస్ చేసే పనిలోనే కరణ్ జోహార్ ఉంటున్నాడు.అలా స్టార్ హీరోల వారసుల్ని మాత్రమే ఎంకరేజ్ చేస్తుంటాడు,బయటి వాళ్లని రానివ్వడం లేదు అవుట్ సైడర్స్‌కి అవకాశం ఇవ్వడం లేదని కరణ్ జోహార్ మీద ట్రోలింగ్(Trolling) జరుగుతుంటుంది. ఇక ఈ క్రమంలో కరణ్ జోహార్ తన మీదే జరిగే ట్రోలింగ్ గురించి రియాక్ట్ అవుతుంటాడు. తాజాగా మరోసారి తన మీద వచ్చే విమర్శలకు సమాధానం ఇచ్చాడు. నెపో కిడ్స్‌ను ఎంకరేజ్ చేస్తుంటానని అంతా ట్రోలింగ్ చేస్తుంటారు,కానీ,అదే అవుట్ సైడర్‌తో సినిమా తీసి హిట్టు కొడితే ఎవ్వరూ ప్రశంసించడం లేదు అని వాపోయాడు.
సౌత్ సినిమా
లక్ష్యతో కిల్ మూవీ తీశానుపెద్ద సక్సెస్ అయింది.అయినా ఏ ఒక్కరూ ప్రశంసించడం లేదు,అవుట్ సైడర్స్‌తో సినిమా తీసి హిట్టు కొట్టిన కరణ్ అని ఒక్క ఆర్టికల్ కూడా కనిపించదే అని బాధపడ్డాడు కరణ్ జోహార్. కిల్ సినిమా విషయంలోనూ కరణ్ చాలా కష్టాలు పడ్డాడట. అదే కథను స్టార్ హీరో దగ్గరకు తీసుకెళ్తే వందల కోట్ల రెమ్యూనరేషన్ అడిగారట. తన సినిమా బడ్జెట్టే 50 కోట్ల లోపు ఉంటే వందల కోట్లు స్టార్ హీరోకి ఎక్కడి నుంచి ఇస్తాను అని కరణ్ అన్నాడు.ప్రస్తుతం కరణ్ జోహార్O(Karan Johar) సౌత్ సినిమాల మీద ఫోకస్ పెట్టాడు. లైగర్ మూవీతో చేతులు కాల్చుకున్న కరణ్, దేవర మూవీతో కాస్త గట్టెక్కినట్టుగా సమాచారం. ఇక సౌత్ సినిమాల్ని అక్కడ నార్త్‌లో డిస్ట్రిబ్యూట్ చేసి లాభాలు గడించాలని కరణ్ అనుకుంటున్నాడు. క్రేజీ కాంబోలని సెట్ చేసేందుకు కూడా కరణ్ ప్రయత్నిస్తున్నాడు. కానీ కరణ్‌కు సరైన కాంబో మాత్రం సెట్ అవ్వడం లేదనిపిస్తోంది.

నెపోటిజం
కరణ్ జోహార్ ట్రోలింగ్‌కు కొత్తేమీ కాదు. గతంలో కంగనా రనౌత్‌తో తలెత్తిన వివాదం, స్టార్ కిడ్స్‌కు చెందిన వారినే ఎంచుకుంటారన్న అభియోగాలు తరచూ వినిపిస్తుంటాయి. కానీ ‘కిల్’ చిత్రంతో ఆయన చేసిన కొత్త ప్రయోగాన్ని చర్చించకుండా, తన గతమే పదే పదే బయటకు తీయడం అన్యాయమని ఆయన అన్నారు.ఈ ట్రోలింగ్ వల్ల తనపై మానసిక ఒత్తిడి బారినపడ్డానని, ఒక వ్యక్తిగా తనను కూడా అర్థం చేసుకోవాలని కోరారు. “ప్రతి ఒక్కరికీ భావోద్వేగాలు ఉంటాయి. సెలబ్రిటీలను(Celebrity)కూడా మనుషుల్లా చూడండి.అని కరణ్ విజ్ఞప్తి చేశారు.మొత్తంగా, కరణ్ జోహార్ తాజా వ్యాఖ్యలు బాలీవుడ్‌లో నెపోటిజం అంశాన్ని మరోసారి చర్చకు తెరలేపాయి. ‘కిల్’ సినిమా తరహాలో అవుట్ సైడర్ నటులకు అవకాశాలు కల్పించాలనే కరణ్ ప్రయత్నం ప్రశంసనీయమే అయినా, అతనిపై ఉన్న ముద్రను అతను పూర్తిగా తుడిచేయలేకపోతున్నట్టే కనిపిస్తోంది.
Read Also :Single: శ్రీవిష్ణు ‘సింగిల్’ మూవీ రివ్యూ!