ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీసెట్ (EAPCET) 2026 ఆన్‌లైన్ దరఖాస్తు గడువును ఉన్నత విద్యా మండలి మరోసారి పొడిగించింది. తాజా నిర్ణయం ప్రకారం, విద్యార్థులు ఎటువంటి ఆలస్య రుసుము (Late Fee) చెల్లించాల్సిన అవసరం లేకుండా మార్చి 24, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Read Also: NHAI: టోల్ ప్లాజాల వద్ద 5,100 మందికి ఉద్యోగాలు!

వాస్తవానికి ఈ గడువు మార్చి 17తో ముగియాల్సి ఉండగా, విద్యార్థుల సౌకర్యార్థం కాకినాడ జేఎన్‌టీయూ (JNTUK) ఈ వెసులుబాటు కల్పించింది.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 24, 2026 (ఆలస్య రుసుము లేకుండా).
- దరఖాస్తుల సవరణ (Correction Window): ఏప్రిల్ 11 నుంచి 13 వరకు.
- హాల్‌టికెట్ల జారీ: ఏప్రిల్ 28 నుంచి.
- పరీక్షల నిర్వహణ: మే 12 నుండి మే 20 వరకు.
ర్యాంకుల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: