हिन्दी | Epaper

Israel: భారత్ కు జమ్మూ కాశ్మీర్ విషయంలో క్షమాపణలు కోరిన ఇజ్రాయెల్

Anusha
Israel: భారత్ కు జమ్మూ కాశ్మీర్ విషయంలో క్షమాపణలు కోరిన ఇజ్రాయెల్

ఇజ్రాయెల్‌–ఇరాన్ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఓ వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది.శుక్రవారం రోజు ఇజ్రాయెల్ టెహ్రాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడగా ఇరాన్ సైతం గట్టిగానే సమాధానం చెప్పింది. ఈక్రమంలోనే ఇజ్రాయెల్ (Israel) సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టింది. ఇరాన్ ప్రపంచ దేశాలకే ముప్పు అని చెబుతూ ఆయా దేశాల పటాలను విడుదల చేసింది. అందులో ఇండియా పటంలో జమ్మూ కాశ్మీర్ లేదు. ముఖ్యంగా పాక్ భూభాగంలో జమ్మూ కాశ్మీర్ దర్శనం ఇచ్చింది.

తప్పును ఒప్పుకున్నట్లు

దీంతో భారతీయులు అంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్ము కశ్మీర్ లేకుండా ఇండియా ఉండదని తేల్చి చెప్పారు. దీంతో తన తప్పును గుర్తించిన ఇజ్రాయెల్ భారత దేశానికి క్షమాపణలు చెప్పింది. ఎక్స్ వేదికగానే తన తప్పును ఒప్పుకున్నట్లు వివరించింది.ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) షేర్ చేసిన పటంలో భారతదేశ ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీసే విధంగా కొన్ని లోపాలు కనిపించాయి.

నెటిజెన్లు డిమాండ్

ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలు మ్యాప్‌లో కనిపించలేదు. అలాగే అరుణాచల్ ప్రదేశ్‌ను కూడా తప్పుగా వర్ణించింది. ఇది మాత్రమే కాకుండా జమ్మూ కాశ్మీర్ పాకిస్థాన్ భూభాగంలో దర్శనం ఇచ్చింది. దీంతో భారతీయ నెటిజన్ల తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే ఈ పోస్టును డిలీట్ చేయాలంటూ భారతీయ నెటిజెన్లు డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) ను ట్యాగ్ చేస్తూ ఇందుకు సంబంధించి పోస్టులు పెట్టారు. ముఖ్యంగా దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన సున్నితమైన విషయాలలో ఇలాంటి పొరపాట్లు అంగీకరించలేమని చెప్పారు.

ముప్పు పొంచి

అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి చిత్రాలను ప్రచురించేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని ఇజ్రాయెల్ అధికారులకు సూచించారు. అయితే తాజాగా దీనిపై ఐడీఎఫ్ (IDF) స్పందించింది. అది కేవలం ఇరాన్ ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలను ఉదరహించడం కోసం చేసిన పోస్టు మాత్రమేనని వెల్లడించింది. అయితే అందులో ఉపయోగించిన మ్యాప్ ఫొటో దేశాల సరిహద్దును కచ్చితంగా చూపించడంలో విఫలం అయిందంటూ తన తప్పును ఒప్పుకుంది. ఈ తప్పిదానికి మేము క్షమాపణలు తెలియజేస్తున్నామంటూ ఎక్స్ వేదికగా పోస్టు చేసింది.

ప్రాముఖ్యత

ఇరాన్‌తో భీకర ఉద్రిక్తతల నడుమ ఇజ్రాయెల్ ఇలా భారత దేశానికి క్షమాపణలు చెప్పడంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇజ్రాయెల్ ఇటీవల ఇరాన్ అణు సౌకర్యాలు, సైనిక కమాండర్లను లక్ష్యంగా చేసుకుని “రైజింగ్ లయన్” అనే పేరుతో పెద్ద ఎత్తున ఆపరేషన్ నిర్వహించింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను టెల్ అవీవ్, ఇతర ఇజ్రాయెల్ నగరాలపైకి ప్రయోగించింది. ఈ దాడులు ప్రతిదాడులతో మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న సమయంలో IDF పోస్ట్ చేసిన తప్పుడు పటం అనవసరమైన వివాదానికి కారణమైంది.

Read Also: World Blood Donor Day: నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

యుద్ధం ఎఫెక్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు బంద్

యుద్ధం ఎఫెక్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు బంద్

మాస్కోలో చికిత్స? ఖమేనీపై రూమర్స్

మాస్కోలో చికిత్స? ఖమేనీపై రూమర్స్

ట్రంప్‌కు షాక్ NCTC చీఫ్ రాజీనామా

ట్రంప్‌కు షాక్ NCTC చీఫ్ రాజీనామా

ఇంధన ఆదా కోసం బుధవారాన్ని సెలవుగా ప్రకటించిన శ్రీలంక

ఇంధన ఆదా కోసం బుధవారాన్ని సెలవుగా ప్రకటించిన శ్రీలంక

ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని, టాప్ కమాండర్ గొలాంరెజాలను హతమార్చిన ఇజ్రాయెల్

ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని, టాప్ కమాండర్ గొలాంరెజాలను హతమార్చిన ఇజ్రాయెల్

ఇరాన్ నుండి ఢిల్లీకి చేరిన 45 మంది విద్యార్థులు

ఇరాన్ నుండి ఢిల్లీకి చేరిన 45 మంది విద్యార్థులు

ఎలన్ మస్క్ VS సామ్ ఆల్ట్‌మాన్..

ఎలన్ మస్క్ VS సామ్ ఆల్ట్‌మాన్..

ఇరాన్ యుద్ధం..రాయలసీమ అరటి రైతులకు భారీ దెబ్బ

ఇరాన్ యుద్ధం..రాయలసీమ అరటి రైతులకు భారీ దెబ్బ

పాకిస్థానీలకు 2 ఏళ్లు.. మనకు 134 ఏళ్లు..

పాకిస్థానీలకు 2 ఏళ్లు.. మనకు 134 ఏళ్లు..

కాబూల్ ఆసుపత్రిపై పాక్ దాడి పై తీవ్రంగా ఖండించిన భారత్

కాబూల్ ఆసుపత్రిపై పాక్ దాడి పై తీవ్రంగా ఖండించిన భారత్

నాకు గర్ల్ ఫ్రెండ్ దొరికిందోచ్..!..పంచ్ ఆనంద కేరింతలు
0:32

నాకు గర్ల్ ఫ్రెండ్ దొరికిందోచ్..!..పంచ్ ఆనంద కేరింతలు

ఆఫ్ఘన్ దాడులపై ఐరాస సమావేశంలో పాకిస్థాన్‌పై భారత్ విమర్శలు

ఆఫ్ఘన్ దాడులపై ఐరాస సమావేశంలో పాకిస్థాన్‌పై భారత్ విమర్శలు

📢 For Advertisement Booking: 98481 12870