हिन्दी | Epaper

Pat Cummins: ఎస్ఆర్ హెచ్ జట్టును వీడనున్న పాట్ కమిన్స్?

Anusha
Pat Cummins: ఎస్ఆర్ హెచ్ జట్టును వీడనున్న పాట్ కమిన్స్?

ఐపీఎల్ 2025 సీజన్‌లో గురువారం సొంత వేదికపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌)నూ చిత్తు చేసింది ముంబై ఇండియన్స్.వాంఖడేలో జరిగిన పోరులో హైదరాబాద్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి ఈ సీజన్‌లో మూడో విజయాన్ని నమోదు చేసింది. మొదట బౌలర్లు సమిష్టిగా రాణించి సన్‌రైజర్స్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయగా బ్యాటర్లు వేగంగా ఆడి ఆ జట్టును గెలిపించారు. స్వల్ప లక్ష్యాన్ని ముంబై 18.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విల్‌ జాక్స్‌ (26 బంతుల్లో 36, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రికెల్టన్‌ (23 బంతుల్లో 31, 5 ఫోర్లు) రాణించారు. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ 20 ఓవర్లలో 162/5కే పరిమితమైంది. అభిషేక్‌ శర్మ (28 బంతుల్లో 40, 7 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా క్లాసెన్‌ (38) ఫర్వాలేదనిపించాడు. జాక్స్‌ (2/14)తో పాటు ఎంఐ పేసర్లు హైదరాబాద్‌ను కట్టడిచేశారు. విల్‌ జాక్స్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఈ సీజన్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్‌కు ఇది ఐదో ఓటమి కావడం గమనార్హం.

పేలవ ప్రదర్శన

(ఐపీఎల్) 2025 సీజన్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకు చాలా పేలవ ప్రదర్శన చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 మ్యాచ్ ల తర్వాత కేవలం 2 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించగలిగింది. ఈ కారణంగా ఆ జట్టు ఇప్పుడు ప్లే ఆప్ రేసు నుంచి నిష్క్రమించే ప్రమాదంలో ఉంది.ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో పెద్ద ఎదురుదెబ్బను ఎదుర్కోవచ్చు. ఐపీఎల్ 2025లో కెప్టెన్ పాట్ కమిన్స్ జట్టును వీడవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇన్‌స్టాగ్రామ్ లో

ఈ సీజన్ లో కెప్టెన్ పాట్ కమిన్స్ జట్టును వీడవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఈరోజు పాట్ కమిన్స్ భార్య బెక్కీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్ లో ఒక కథనాన్ని పోస్ట్ చేసింది.ఆమె దేశం విడిచి వెళ్తున్నట్లు క్యాప్షన్ రాసుకొచ్చింది. కమిన్స్ భార్య తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రెండు కథనాలను పోస్ట్ చేసింది. “పాట్ కమ్మిన్స్ ఎప్పుడూ ఎక్కువ సామాను తీసుకెళ్తాడు” అని ఒక పోస్టులో రాసింది. రెండో పోస్టులో “భారతదేశానికి వీడ్కోలు. ఈ అందమైన దేశానికి రావడం మాకు చాలా ఇష్టం.” అంటూ కమిన్స్ భార్య ఇన్‌స్టాలో పోస్టు చేయడంతో వార్తలు వ్యాపించాయి. ఈ పోస్టు వెలువడిన తర్వాత అభిమానులు స్పందిస్తున్నారు,అయితే ఇందులో ఎంత నిజం ఉందో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఫ్రాంచైజ్ లేదా ఆటగాడు దీనికి సంబంధించి ఎటువంటి అప్‌డేట్ ఇవ్వలేదు.

Read Also: Rohit Sharma: రోహిత్ శర్మ పేలవ ఫామ్ పై మాజీ క్రికెటర్ ఏమన్నాడంటే.!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రెడ్ కార్పెట్‌పై ప్రియాంక చోప్రా, ఈషా అంబానీ రాయల్ ఎంట్రీ!

రెడ్ కార్పెట్‌పై ప్రియాంక చోప్రా, ఈషా అంబానీ రాయల్ ఎంట్రీ!

కాబూల్ ఆస్పత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడి.. 400 మంది మృతి
0:18

కాబూల్ ఆస్పత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడి.. 400 మంది మృతి

ఆస్కార్ అవార్డులకు నోచుకోని మనదేశ సినిమాలు..ఎందుకని?

ఆస్కార్ అవార్డులకు నోచుకోని మనదేశ సినిమాలు..ఎందుకని?

కాబూల్‌లో పాక్ మారణహోమం.. రషీద్ ఖాన్ తీవ్ర ఆగ్రహం

కాబూల్‌లో పాక్ మారణహోమం.. రషీద్ ఖాన్ తీవ్ర ఆగ్రహం

యుద్ధ సెగ.. విదేశీ పర్యటనలు రద్దు చేసుకుంటున్న టూరిస్టులు

యుద్ధ సెగ.. విదేశీ పర్యటనలు రద్దు చేసుకుంటున్న టూరిస్టులు

పాక్-ఆఫ్ఘాన్ ఉద్రిక్తత, కాబూల్‌లో భారీ దాడి

పాక్-ఆఫ్ఘాన్ ఉద్రిక్తత, కాబూల్‌లో భారీ దాడి

అఫ్గానిస్థాన్ పై పాకిస్థాన్ దాడి.. 400 మంది మృతి!

అఫ్గానిస్థాన్ పై పాకిస్థాన్ దాడి.. 400 మంది మృతి!

ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు

ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు

నాటో దేశాలకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్.

నాటో దేశాలకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్.

ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ అధ్యక్షుడి విమానం ధ్వంసం

ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ అధ్యక్షుడి విమానం ధ్వంసం

ప్ర‌ధాని మోదీ వెళ్లిపోగానే..ఇరాన్‌పై దాడి

ప్ర‌ధాని మోదీ వెళ్లిపోగానే..ఇరాన్‌పై దాడి

భారత్‌కు హార్డ్ రాక్ గుడ్ బై!

భారత్‌కు హార్డ్ రాక్ గుడ్ బై!

📢 For Advertisement Booking: 98481 12870