हिन्दी | Epaper

Operation Sindhur: “ఆపరేషన్ సింధూర్” పై సీఎం చంద్రబాబు ఏమన్నారంటే ?

Anusha
Operation Sindhur: “ఆపరేషన్ సింధూర్” పై సీఎం చంద్రబాబు ఏమన్నారంటే ?

ఆపరేషన్ సిందూర్ పేరుతో పహల్గామ్ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది.బుధవారం ( మే 7, 2025 ) అర్ధరాత్రి 1:44 గంటలకు పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పిఓకే ) లోని ఉగ్ర శిబిరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులు నిర్వహించింది.ఒక రాత్రిలోనే మూడు టెర్రర్‌ హెడ్‌క్వార్టర్స్‌ నేలమట్టం చేసింది. పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రదాడిపై ప్రతీకారంగా మురిడ్కేలో భారత ఆర్మీ దాడులు చేసింది.ఈ ఆపరేషన్‌లో మొత్తం 9 ఉగ్ర స్థావరాలపై లక్ష్యంగా దాడులు జరపగా సుమారు 30 మంది ఉగ్రవాదులు హతమయినట్టు సమాచారం. భారత ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. మిస్సైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి.పాకిస్తాన్ తో పాటుగా పీఓకే లోని ఉగ్రవాద శిబిరాల పైన అర్ద్రరాత్రి భారత సైన్యం మెరుపు దాడి చేసింది. డ్రోన్లు, క్షిపణులతో భారత ఏయిర్ ఫోర్స్ విరుచుకుపడింది. ఉగ్రవాద శిబిరాల పైన పక్కా సమాచారంతో గురి పెట్టి మరీ భారత సైన్యం, క్షిపణులు ప్రయోగించింది. ఉగ్రవాద శిబిరాల పైన భారత్ సైన్యం దాడులను దేశ వ్యాప్తంగా అందరూ సమర్థిస్తున్నారు. పుల్వామా దాడికి ప్రతీకారంగా 2019లో బాలాకోట్‌ తర్వాత పాక్ సరిహద్దుల్లోకి వెళ్లి భారత్ చేసిన అతిపెద్ద దాడి ఇదే.

ప్రకటన

ఈ దాడుల్లో జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల టాప్ లీడర్లను లక్ష్యంగా చేసుకున్నట్టు సమాచారం. వారి శిక్షణా శిబిరాలు, కమ్యూనికేషన్ హబ్‌లు, ఆయుధ నిల్వలు తుడిచి పెట్టివేసినట్టు తెలుస్తోంది. పాకిస్థాన్ సైనిక స్థావరాల జోలికి పోకుండా, కేవలం ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారిన చోట్లనే మన బలగాలు దాడులు చేపట్టినట్టు స్పష్టం అవుతోంది. ఇండియన్‌ ఆర్మీ న్యాయం జరిగింది అని ఎక్స్‌లో పోస్టు చేసింది. దీంతో ఆపరేషన్‌ సిందూర్‌పై పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ‘భారత్‌ మాతా కీ జై’ పేరుతో సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం చంద్రబాబు సైతం ఈ ఘటనపై రియాక్ట్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన ఇండియన్ ఆర్మీ ట్వీట్ ని రీ ట్వీట్ చేసి జై హింద్ అని రాసుకొచ్చారు.

ప్రతినిధి

ఇక భారత సైన్యం దాడులు చేసినట్టు పాకిస్థాన్‌ నిర్ధారించింది. కోట్లి, ముజఫరాబాద్‌, బహవల్‌ పూర్‌ ప్రాంతాలపై మిసైల్స్‌తో దాడులు చేసినట్లు పాకిస్థాన్‌ సైనిక ప్రతినిధి వెల్లడించారు. ఈ దాడుల్లో ముగ్గురు మృతి చెందగా, మరో 12 మంది గాయపడినట్టు పాక్ వెల్లడించింది. అంతే కాకుండా సోషల్ మీడియాలో సైతం ఈ మెరుపు దాడులకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.మరోవైపు శ్రీనగర్, జమ్ము, అమృత్‌సర్‌, ధర్మశాల, లేహ్‌ ఎయిర్‌పోర్టులను భారత్‌ మూసివేసినట్లు సమాచారం. దేశ వ్యాప్తంగా నేడు కేంద్ర ప్రభుత్వం మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించనున్న వేళ ఈ దాడులు చేయడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అలానే మెరుపు దాడులకు సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తామని ప్రకటించింది రక్షణ శాఖ.

Read Also: Visa: వీసాలను దుర్వినియోగం చేస్తున్న వారిపై కొరడా ఝుళిపిస్తున్న బ్రిటన్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

AI నేర్చుకోకపోతే ప్రమోషన్ లేదు.. ఉద్యోగం కూడా కష్టమే!

AI నేర్చుకోకపోతే ప్రమోషన్ లేదు.. ఉద్యోగం కూడా కష్టమే!

ఓమన్‌లోని సోహార్ నగరంలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

ఓమన్‌లోని సోహార్ నగరంలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

హర్మూజ్ జలసంధిలో ‘మైన్స్’ వార్..ఆయిల్ సరఫరాకు ముప్పు!

హర్మూజ్ జలసంధిలో ‘మైన్స్’ వార్..ఆయిల్ సరఫరాకు ముప్పు!

ఇరాన్ ముందు అమెరికా ఎందుకు వెనక్కి? అసలు కారణాలు..

ఇరాన్ ముందు అమెరికా ఎందుకు వెనక్కి? అసలు కారణాలు..

ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

లొంగిపోయేందుకు ఇరాన్ సిద్ధం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

లొంగిపోయేందుకు ఇరాన్ సిద్ధం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

అమెరికా విమానం కూలిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి

అమెరికా విమానం కూలిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి

పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

భారతీయుల భద్రతపై ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

భారతీయుల భద్రతపై ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ కానున్న జెలెన్స్కీ

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ కానున్న జెలెన్స్కీ

దుబాయ్‌లో ఆకాశానికి నిత్యావసరాల ధరలు

దుబాయ్‌లో ఆకాశానికి నిత్యావసరాల ధరలు

గ్యాస్ కొరత: గ్యాస్ స్టవ్‌కు ప్రత్యామ్నాయాల వైపు పరుగులు

గ్యాస్ కొరత: గ్యాస్ స్టవ్‌కు ప్రత్యామ్నాయాల వైపు పరుగులు

📢 For Advertisement Booking: 98481 12870