జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడిని యూకే ఎంపీ ప్రీతి పటేల్ ఖండించారు. ఉగ్రవాదాన్ని నిరోధించడానికి భారత్‌కు అందించే సహకారాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. పహల్గాం బాధిత కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద స్థావరాల ముప్పును గుర్తించాలని కోరారు. ఈ మేరకు యూకే హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఆమె మాట్లాడారు.
శాంతి- భద్రత, స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి సహకరించాలి
“ఈరోజు హౌస్ ఆఫ్ కామన్స్‌లో పహల్గాంలో జరిగిన దారుణం వల్ల ప్రభావితమైన వారికి నా సంతాపాన్ని పునరుద్ఘాటించాను. ఉగ్రవాదం వల్ల ప్రభావితమైన వారికి అంకా అండగా నిలబడాలి. ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడానికి, ఉద్రిక్తతలను తగ్గించడానికి, శాంతి- భద్రత, స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి భారత్‌తో బ్రిటన్ ప్రభుత్వం పనిచేయాలి” అని ప్రీతి పటేల్ ఎక్స్‌లో పిలుపునిచ్చారు.

పహల్గాంలో హింసాత్మక ఉగ్రవాదం
“ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది పర్యటకులను క్రూరంగా, దారుణంగా చంపారు. చాలా మంది బాధితుల తలలపై తుపాకీ గురిపెట్టి పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో చంపేశారు. పహల్గాంలో హింసాత్మక ఉగ్రవాదం వల్ల ప్రభావితమైన వారందరితో నా ఆలోచనలు, ప్రార్థనలు ఉన్నాయి. పహల్గాం ఇప్పుడు ఉగ్రవాద చర్యల వల్ల ప్రభావితమైన ముంబయి, దిల్లీ వంటి భారతీయ నగరాల జాబితాలో చేరింది” అని ప్రీతి పటేల్ వ్యాఖ్యానించారు.
ఒసామా బిన్ లాడెన్ దాక్కున్న దేశం అది
భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించాలని చెబుతూనే, పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులు ఎదుర్కొంటున్న ముప్పును UK గుర్తించాలని ప్రీతి చెప్పారు. ఒసామా బిన్ లాడెన్ దాక్కున్న దేశం అదని వ్యాఖ్యానించారు. పహల్గాం దాడి తర్వాత బ్రిటిష్ భారత్‌కు ఏదైనా భద్రతా సహాయం అందించిందా అని ప్రీతి పటేల్ ప్రశ్నించారు.
Read Also: All-Party Meeting: ఆపరేషన్ సింధూర్ పై అఖిలపక్ష సమావేశం