हिन्दी | Epaper

Virat Kohli: టెస్ట్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన శుభ్‌మన్ గిల్

Anusha
Virat Kohli: టెస్ట్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన శుభ్‌మన్ గిల్

భారత యువ క్రికెట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన అసాధారణ ప్రతిభను మళ్లీ నిరూపించుకున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదిక (Edgbaston Venue) గా జరుగుతున్న రెండో టెస్టులో గిల్ తన కెరీర్‌లోనే, భారత టెస్టు చరిత్రలోనూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు. 269 పరుగులతో డబుల్ సెంచరీ సాధించిన గిల్, టెస్టుల్లో భారత కెప్టెన్‌గా అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ (Virat Kohli) రికార్డును అధిగమించాడు. గతంలో విరాట్ 2019లో 254 నాటౌట్ చేసాడు.గిల్ అద్భుత ఇన్నింగ్స్ ఫలితంగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఈ సిరీస్‌లో ఆ ఒత్తిడిని పక్కనపెట్టి

ఈ మ్యాచ్‌లో గిల్ చూపించిన ఆటతీరు అభిమానులకే కాకుండా మాజీ క్రికెటర్ల ప్రశంసలు కూడా అందుకున్నాడు.ఇలా తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడిన అనంతరం శుభ్‌మన్ గిల్ తన విజయం వెనుక ఉన్న రహస్యాన్ని పంచుకున్నాడు. “కొంతకాలంగా పరుగుల ఒత్తిడితో బ్యాటింగ్‌ను ఆస్వాదించలేకపోయాను. ఈ సిరీస్‌ (Series) లో ఆ ఒత్తిడిని పక్కనపెట్టి, చిన్నప్పుడు ఆడినట్లుగా స్వేచ్ఛగా ఆడాలనుకున్నాను. అదే నాకు బాగా కలిసొచ్చింది” అని గిల్ తెలిపాడు. తన బేసిక్ మూవ్స్‌, సెటప్‌పై దృష్టి సారించడం కూడా ఫామ్‌లోకి రావడానికి దోహదపడిందని వివరించాడు.

Virat Kohli: టెస్ట్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన శుభ్‌మన్ గిల్
Virat Kohli: టెస్ట్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన శుభ్‌మన్ గిల్

క్రీజులో కుదురుకుంటే

తొలి రోజు ఆటలో పరుగులు చేయడానికి కాస్త ఇబ్బంది పడినప్పుడు, గౌతమ్ గంభీర్‌తో మాట్లాడానని గిల్ (Shubman Gill) వెల్లడించాడు. “వికెట్ బాగున్నప్పుడు క్రీజులో కుదురుకుంటే, ఎంతసేపైనా బ్యాటింగ్ చేయాలని, సులభంగా వికెట్ చేజార్చుకోకూడదని నిర్ణయించుకున్నాను. గత మ్యాచ్ అనుభవం నాకు ఈ విషయంలో ఉపయోగపడింది” అని అన్నాడు. ఈ అద్భుత ప్రదర్శనతో సేనా (SENA) దేశాల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆసియా కెప్టెన్‌గా గిల్ మరో రికార్డును కూడా త‌న ఖాతాలో వేసుకున్నాడు. 

Read hindi news: hindi.vaartha.com

Read Also: IND vs ENG: ఫోకస్‌ వల్లే రికార్డు ఇన్నింగ్స్ సాధ్యమైంది: గిల్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!

16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!

మొజ్తబా ఖమేనీ ఆచూకీ పై భారీ రివార్డు ప్రకటించిన అమెరికా

మొజ్తబా ఖమేనీ ఆచూకీ పై భారీ రివార్డు ప్రకటించిన అమెరికా

రష్యా చమురు కొనాలని ట్రంప్ ఒత్తిడి..అమెరికాపై విరుచుకుపడిన ఇరాన్

రష్యా చమురు కొనాలని ట్రంప్ ఒత్తిడి..అమెరికాపై విరుచుకుపడిన ఇరాన్

📢 For Advertisement Booking: 98481 12870