
ఏ దేశంలోనైనా ఆందోళనలు జరుగుతుంటే అవి ఆగిపోయి, ప్రజలు ప్రశాంతంగా జీవించేందుకు దేశాధినేతలు తోర్పడాలి. అందుకు మద్దతు పలకాలి. అయితే విచిత్రం ఇరాన్ లో సుప్రీం లీడర్ అయాతొల్లా ఖమేనీ వెంటనే పదవి నుంచి దిగిపోవాలంటూ ప్రజలు పెద్ద ఎత్తున చేస్తున్న ఆందోళనలు మరింతగా పెరగాలని అమెరికా(USA) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరుతున్నారు. ఖమేనీకీ వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు, ఆందోళనలు అణిచివేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇదెక్కడి చోద్యం. ఆ దేశం ఆందోళనలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ట్రంప్ కుమాత్రం ఆనందంగా ఉంది. అయాతొల్లా ఖమేనీ ఏవిధంగానైనా అంతమొందించాలని ట్రంప్ ఆశయంగా ఉంది. అందుకే ఇరాన్ లో గతపదిరోజులుగా జరుగుతున్న నిరసనలకు ట్రంప్ మద్దతు ఇస్తున్నారు.
Read Also: Syrian army : Aleppoలో కర్ఫ్యూ, సిరియా సైన్యం SDF మధ్య తీవ్ర ఘర్షణలు
ఆదేశ పరిస్థితులపై జోక్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్కడ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రజలు సురక్షితంగా జీవించాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ ట్రంప్ ఇందుకు విరుద్ధంగా ఆలోచిస్తున్నారు. ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ లో నిరసనలు చెలరేగినప్పుడు అక్కడి దేశాధినేతలు వీటిని అణిచివేయాలనుకుంటారు. ఇది సహజం. కానీ ఈసారి కూడా అలా చేస్తే మేం జోక్యం చేసుకుంటాం. వాళ్లని తీవ్రంగా దెబ్బతీస్తామని ట్రంప్ పేర్కొన్నారు.
45మందికి చేరిన మృతుల సంఖ్య
గత కొన్నిరోజులుగా జరుగుతున్న నిరసనల్లో ఇప్పటిదాకా 45 మంది మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై కూడా ట్రంప్(USA) స్పందించారు. నిరసనలు జరిగేటప్పుడు తొక్కిసలాట వల్ల జరిగిందని దీనికి ఎవరినీ బాధ్యులను చేయలేమని అన్నారు. అలాగే ఇరాన్ నిరసనకారులను చాలా ధైర్యవంతులంటూ కొనియాడారు. ఇదిలా ఉండగా ఇరాన్లో ఆర్థిక సంక్షోభం వల్ల అక్కడి ప్రజలు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. కరెన్సీ విలువ దారణంగా పడిపోయింది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరోవైపు ప్రవాసంలో తలదాచుకున్న యువరాజు రెజా పహ్లవి కూడా నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో ఈ ఆందోళనలు ఇరాన్ అంతటా విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలోనే అక్కడి ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్, టెలిఫోన్ సేవలను నిలిపివేసింది. అక్కడ జరుగుతున్న నిరసనలకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: