हिन्दी | Epaper

America: శాంతి చర్చలపై రష్యాకు అమెరికా వార్నింగ్

Vanipushpa
America: శాంతి చర్చలపై రష్యాకు అమెరికా వార్నింగ్

ఉక్రెయిన్​తో శాంతి చర్చలు నిలిచిపోతే రష్యాపై నూతన ఆంక్షలు విధిస్తామని అమెరికా (America) తెలిపింది. రష్యా-ఉక్రెయిన్‌(Russia-Ukraine) కాల్పుల విరమణ ఒప్పందంపై అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో(Marco Rubio) ఈ మేరకు మాట్లాడారు. రెండు దేశాల మధ్య శాంతి చర్చలు ఆగిపోతే రష్యా(Russia) అదనపు ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రష్యా చేస్తున్న ఆలస్యాన్ని గమనిస్తే చర్చలు జరిపే ఉద్దేశం ఉందా? లేదా అనే విషయం స్పష్టమవుతోందని సెనెట్‌లో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యనించారు.

America: శాంతి చర్చలపై రష్యాకు అమెరికా వార్నింగ్
America: శాంతి చర్చలపై రష్యాకు అమెరికా వార్నింగ్

కాల్పుల విరమణ ఒప్పందానికి రష్యా నియమాలు
‘కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి రష్యా తనకు ఉన్న నియమాలను పేర్కొంటోంది. ఈ విషయంలో ఎలాంటి నియమాలు పెడుతుందనేది ఇంకా తెలియదు. వాటి గురించి సమాచారం అందిన తర్వాత యుద్ధం ముగింపుపై రష్యా వైఖరి ఏంటనేది తెలుస్తోంది. ఈసారి చర్చలు ఫలిస్తాయని ఆశిస్తున్నా. శాంతి కొనసాగించడానికి రష్యా ఇష్టపడకపోయినా, యుద్ధం కొనసాగించాలని భావించినా అమెరికా కూడా ఆదేశంపై అలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే, చర్చల సమయంలో ఆంక్షలు విధించడం గురించి మాట్లాడితే దౌత్య ప్రక్రియ దెబ్బతింటుంది’ అని రూబియో పేర్కొన్నారు.
రష్యాపై ఆంక్షలను స్వాగించిన ఉక్రెయిన్
మరోవైపు రష్యాపై ఐరోపా సంఘం, బ్రిటన్ ఆంక్షలు విధించడాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్​ స్కీ స్వాగతించారు. యూకే ప్రధానమంత్రి కీర్​ స్టార్మర్​కు ఫోన్​లో కృతజ్ఞతలు తెలిపారు. ఇది రష్యా యుద్ధాన్ని ముగించేందుకు ఒత్తిడి చేయడంలో సహాయపడుతుందని ఆశిస్తున్నట్లుగా చెప్పారు. ఈ విషయాన్ని ఎక్స్​ వేదికగా పోస్ట్ చేశారు.
ముడిచమురు సరఫరా ద్వారా ఆదాయం
‘ముడిచమురు సరఫరా ద్వారా ఆదాయం ఆర్జించి రష్యా దాడులకు పాల్పడుతోంది. రష్యాపై ఆంక్షలు విధించినందుకు థ్యాంక్యూ బ్రిటన్!. యూకే ప్రధానితో దౌత్య ప్రయత్నాలకు సంబంధించి కీలక అంశలను చర్చించాం. యుద్ధాన్ని ముగించేందుకు అంతర్జాతీయంగా ప్రతిస్పందన అవసరం. ఇప్పుడు యూకే, ఈయూ నుంచి రష్యాపై ఆంక్షలు విధిస్తున్నట్లు ఆంక్షలు నిర్ణయం వచ్చింది. ఉక్రెయిన్​లో కాల్పుల విరమణ, శాంతి కోసం కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి రష్యాపై కూడా అమెరికా చర్యలు తీసుకోవాలని కోరుతున్న. అలా చేస్తే మంచిది’ అని జెలెన్​స్కీ అన్నారు.
రష్యా సంస్థలపై నిషేధం
రష్యాపై ఐరోపా సంఘం, బ్రిటన్ తాజాగా మరిన్ని ఆంక్షలు విధించాయి. పశ్చిమ దేశాల ఆంక్షలను తప్పించుకుంటూ రష్యా షాడో ఫ్లీట్‌గా వ్యవహారంలో ఉండి చమురును అక్రమంగా రవాణా చేస్తున్న 200 నౌకలపై ఈయూ ఆంక్షలు విధించింది. మాస్కోకు చెందిన ఆస్తులను స్తంభింపజేసింది. పలువురు అధికారుల ప్రయాణాలతో పాటు అనేక రష్యా సంస్థలపై నిషేధం విధించింది. బ్రిటన్‌ కూడా 100 కొత్త ఆంక్షలను విధిస్తూ షాడో ఫ్లీట్‌ను లక్ష్యంగా చేసుకుంది. రష్యాకు అందే ఆయుధ సరఫరా గొలుసులను విచ్ఛిన్నం చేయడం కూడా ఆంక్షల పరమార్థమని అధికారులు వెల్లడించారు.

Read Also: Golden Dome: 175 బిలియ‌న్ల డాల‌ర్ల‌తో ‘గోల్డెన్ డోమ్‌’ ప్లాన్ ప్ర‌కటించిన డోనాల్డ్ ట్రంప్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఓమన్‌లోని సోహార్ నగరంలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

ఓమన్‌లోని సోహార్ నగరంలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

హర్మూజ్ జలసంధిలో ‘మైన్స్’ వార్..ఆయిల్ సరఫరాకు ముప్పు!

హర్మూజ్ జలసంధిలో ‘మైన్స్’ వార్..ఆయిల్ సరఫరాకు ముప్పు!

ఇరాన్ ముందు అమెరికా ఎందుకు వెనక్కి? అసలు కారణాలు..

ఇరాన్ ముందు అమెరికా ఎందుకు వెనక్కి? అసలు కారణాలు..

ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

లొంగిపోయేందుకు ఇరాన్ సిద్ధం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

లొంగిపోయేందుకు ఇరాన్ సిద్ధం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

అమెరికా విమానం కూలిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి

అమెరికా విమానం కూలిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి

పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

భారతీయుల భద్రతపై ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

భారతీయుల భద్రతపై ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ కానున్న జెలెన్స్కీ

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ కానున్న జెలెన్స్కీ

దుబాయ్‌లో ఆకాశానికి నిత్యావసరాల ధరలు

దుబాయ్‌లో ఆకాశానికి నిత్యావసరాల ధరలు

గ్యాస్ కొరత: గ్యాస్ స్టవ్‌కు ప్రత్యామ్నాయాల వైపు పరుగులు

గ్యాస్ కొరత: గ్యాస్ స్టవ్‌కు ప్రత్యామ్నాయాల వైపు పరుగులు

యుద్ధంలోనూ ఆర్థికంగా ఎలా గెలుస్తోంది? అసలు రహస్యం ఏంటి?

యుద్ధంలోనూ ఆర్థికంగా ఎలా గెలుస్తోంది? అసలు రహస్యం ఏంటి?

📢 For Advertisement Booking: 98481 12870